తెలంగాణ

గ్రేటర్ వరంగల్ ఫలితాల్లో తూర్పున హవా పశ్చిమలో డీలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసినప్పటికీ పశ్చిమలో ఆ పార్టీ దాదాపు నాలుగు సీట్లను కోల్పోయి కాంగ్రెస్ చేతుల్లో పెట్టింది. గ్రేటర్ పరిధిలో మెజార్టీ డివిజన్లు తూర్పు పశ్చిమలోనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు తూర్పులో హవా కొనసాగినా పశ్చిమలో టిఆర్‌ఎస్ హవాకు కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డి అడ్డుపడ్డారు. టిఆర్‌ఎస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. 33వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తొట్ల రాజు అధికార టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఇండ్ల నాగేశ్వర్‌రావుపై విజయం సాధించారు. అదేవిధంగా 35వ డివిజన్‌లో అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థి సుంకు రేణుకపై స్వతంత్ర అభ్యర్థి శ్రీలేఖ విజయం సాధించారు. 39వ డివిజన్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి చీకటి ఆనంద్‌పై కాంగ్రెస్ అభ్యర్థి వేముల శ్రీనివాస్ గెలుపొందారు. అదేవిధంగా 52వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల రమ సమీప అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థి రాజమణిపై విజయం సాధించారు. 53వ డివిజన్‌లో అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థి ఆవాల రాధికరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి లింగం వౌనిక గెలుపొందారు. అయితే కాజీపేట పరిధిలో ఉన్న మూడు డివిజన్‌లలో కాంగ్రెస్ నేత, డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి తన సత్తా చాటారు. 33, 35, 52, 53 డివిజన్‌లలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ పరువు నిలిపారు. లేనట్లయితే కాంగ్రెస్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కనీస పరువు కూడా దక్కేదు కాదు. ఆ నాలుగు డివిజన్‌లలో టిఆర్‌ఎస్ అభ్యర్థుల ఓటమికి అక్కడ స్థానిక నేతల్లో ఉన్న గ్రూపు రాజకీయాలే కారణమని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు సొంత పార్టీ నాయకుల వెన్నుపోటు కారణంగానే స్వల్ప మెజార్టీతో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు.
శ్రీశైలంలో
విద్యుదుత్పత్తి ప్రారంభం
శ్రీశైలంప్రాజెక్టు, మార్చి 9: శ్రీశైలం ప్రాజెక్టులోని కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా బుధవారం 3.562 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. తెలంగాణ భూగర్భ పవర్ హౌస్ ద్వారా 1.663 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 3605 క్యూసెక్కుల నీటిని, కుడిగట్టు పవర్ హౌస్ ద్వారా 1.899 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 4229 క్యూసెక్కుల నీటిని, మొత్తంగా 7834 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదిలారు. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను 813.40 అడుగులుగా, గరిష్ట నీటి నిలువ 215 టిఎంసిలకుగాను 36.92 టిఎంసిలుగా నీటి నిల్వ ఉంది.
పులిచింతల పునరావాస కేంద్రాన్ని
పరిశీలించిన ఈజిప్టు బృందం
కోదాడ, మార్చి 9: ఈజిప్టు దేశానికి చెందిన 15 మంది సభ్యులతో కూడిన అధ్యయన బృందం బుధవారం నల్లగొండ జిల్లా కోదాడ మండలం గుడిబండ శివారులో వున్న అడ్లూరు పులిచింతల పునరావాస కేంద్రాన్ని సందర్శించి పరిశీలించింది. ఈజిప్టు దేశంలోనూ పులిచింతల వంటి ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నందున ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి భూసేకరణ చేసిన విధానం, భూములు కోల్పోయిన ప్రజలకు అందించిన పరిహారం, ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా ముంపుకు గురైతున్న గ్రామాల ప్రజలకు ఏర్పాటు చేస్తున్న పునరావాసం, పరిహారం చెల్లించేందుకు అనుసరించిన విధానాలు, అధికారులు చేసిన విచారణలు, చెల్లింపుల తీరు తదితర విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఈజిప్టు ప్రభుత్వం 15 మంది నిపుణులతో కూడిన అధ్యయన బృందాన్ని పంపింది. ఈ బృందం అడ్లూరు పునరావాస కేంద్రాన్ని సందర్శించి పునరావాసం, పరిహారంపై ప్రజలను వివిధ ప్రశ్నలను అడిగారు. ఈజిప్టు అధ్యయన బృందం వెంట సూర్యాపేట ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, కోదాడ, మేళ్లచెర్వు తహశీల్దార్‌లు వందనపు శ్రీదేవి, వెంకన్న తదితరులు వున్నారు.

అసెంబ్లీ పరిసరాల్లో
16 వరకు నిషేధాజ్ఞలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ పరిసరాలతోపాటు రెండు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ప్రాంగణ పరిసరాలతోపాటు అసెంబ్లీ చుట్టూ రెండు కిలోమీటర్ల దూరంలో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతివ్వకూడదని ఆయన పోలీస్ అధికారులకు సూచించారు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 16వరకు అమల్లో ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు. ఆంధ్రా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో 144వ,సెక్షన్ విధించినట్టు ఆయన వివరించారు. నగరంలో అనుమతిలేని డ్రోన్‌లు వినియోగించరాదని, ఎలాంటి ప్రదర్శనలు నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒకే సమయంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆమోద సమావేశం, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిషేధాజ్ఞలు విధించినట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలే విజయాన్ని చేకూర్చాయి: కవిత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)కు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని చేకూర్చాయని నిజామాబాద్ ఎంపి కె.కవిత వ్యాఖ్యానించారు. ఇదే ఒరవడితో 2019 ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టి మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ సమర్ధ నాయకత్వానికి మద్దతు తెలిపిన ప్రజలు ఈ విజయాన్ని కట్టబెట్టారని అన్నారు.