తెలంగాణ

విలీనమే తరువాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల పదవ తేదీన ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ముందే టిడిపి శాసన సభాపక్షం టిఆర్‌ఎస్‌లో విలీనంపై స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత సంవత్సరం శాసన మండలిలో టిడిపి పక్షాన్ని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించిన తరహాలోనే టిడిపి శాసన సభాపక్షం టిఆర్‌ఎస్‌లో విలీనం అయినట్టు ప్రకటిస్తారని తెలిసింది. అయితే ఈలోగా అనర్హత ఫిర్యాదులపై స్పీకర్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుంటారు. తొలుత చేరిన ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలకూ ఇప్పటికే నోటీసులు పంపగా, తాజాగా చేరిన మిగిలిన ఐదుగురికి తాజాగా గురువారం నోటీసులిచ్చారు. టిడిపి ఫిర్యాదు మేరకు స్పీకర్ ఈ నోటీసులు జారీ చేశారు. పదిమంది ఎమ్మెల్యేల వ్యవహారం ఒకేసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది. తొలుత మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, సాయన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్‌ఎస్‌లో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని టిడిపి శాసనసభాపక్షం నాయకునిగా
ఎర్రబెల్లి దయాకర్‌రావు తొలుత స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయస్థానానికి వెళ్లారు. ఆ తరువాత ఏకంగా ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు మరో నలుగురు టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరారు. అనర్హత వేటు వేయాలని శాసనసభాపక్షం నాయకునిగా తొలుత ఫిర్యాదు చేసిన ఎర్రబెల్లి అధ్యక్షతన ఇటీవల పదిమంది ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. వారు టిడిఎల్‌పిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు తీర్మానం చేసి స్పీకర్‌కు తీర్మాన ప్రతిని అందజేశారు. ఎర్రబెల్లి నాయకత్వంలో ఈ తీర్మానం చేసి స్పీకర్‌కు అందజేసిన తరువాత, మిగిలిన ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలకు శాసనసభాపక్షం నాయకునిగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేశారు. దయాకర్‌రావుతోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాలు అన్నింటిపైనా స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుంటారు. 15 మంది ఎమ్మెల్యేల్లో పదిమంది టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని నిర్ణయించినందున తమ నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే టిఆర్‌ఎస్‌లో విలీనం అవుతున్నట్టు తీర్మానం చేయడానికంటే ముందే టిడిపి స్పీకర్‌కు ఫిర్యాదు చేసినందున తమ ఫిర్యాదుపై స్పీకర్ ముందు నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుందనేది టిడిపి వాదన. ఫిర్యాదు చేసిన దయాకర్‌రావే టిఆర్‌ఎస్‌లో విలీనం అవుతున్నట్టు ప్రకటించారన్న విషయాన్ని టిఆర్‌ఎస్ నాయకులు గుర్తుచేస్తున్నారు. దయాకర్‌రావు ఫిర్యాదుపై స్పీకర్ విచారణ జరిపినప్పుడు శాసనసభాపక్షం నాయకునిగా దయాకర్‌రావు నిర్ణయానికే విలువ ఉంటుంది అనేది వీరి వాదన. పదిమంది ఎమ్మెల్యేలు విలీన నిర్ణయం తీసుకున్న తరువాత రేవంత్‌రెడ్డి టిడిపి శాసనసభాపక్షం నాయకుడు అయ్యారని, ఆయన మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకే శాసనసభాపక్షం నాయకుడు అవుతారనేది ముందు టిఆర్‌ఎస్‌లో చేరిన వారి వాదన. స్పీకర్ నోటీసుకు ఇదే కోణంలో సమాధానం ఇస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు.