తెలంగాణ

దక్కింది హామీలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్ అధికారపక్షం తెరాస అసంతృప్తి

ఇవీ కేటాయింపులు

పన్నుల్లో వాటా రూ.13,955.35 కోట్లు, గిరిజన వర్శిటీకి రూ. కోటి, రాష్ట్రంలో ఐఐటి ఏర్పాటుకు రూ.20 కోట్లు, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌కు రూ.15 కోట్లు, సింగరేణి అభివృద్ధికి 23వేల కోట్లు. ఇదికాకుండా రైతుల రుణ విముక్తికి కేంద్రం కేటాయించిన రూ.15 వేల కోట్లులో
తెలంగాణ వాటా తేలాల్సి ఉంది.

హైదరాబాద్: వ్యవసాయం, ప్రాజెక్టులు, పేదలు, మధ్యతరగతికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన కేంద్ర బడ్జెట్ ఆశా జనకంగా ఉన్నా, తెలంగాణకు కేటాయింపుల అంశానికి వచ్చేసరికి తీవ్ర నిరాశ మిగిల్చిందని అధికారపక్షం విమర్శిస్తోంది. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా ప్రత్యేక హోదా కల్పిస్తారని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు తగిన కేటాయింపులు బడ్జెట్‌లో ఉంటాయని ప్రభుత్వం ఆశించింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను గుర్తు చేస్తూ దాదాపు 30వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులపై సిఎం కెసిఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. ఆశించినంతగా కాకున్నా, అసంతృప్తి లేనంతగానైనా కేంద్రం నుంచి కొత్త రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయని ఆశించారు. ఆంధ్రకు దాదాపు 2వేల కోట్ల రూపాయల మేర ప్రత్యేక కేటాయింపులు ఉంటే, తెలంగాణకు కేవలం గిరిజన వర్శిటీకి కోటి, బాసర ట్రిబుల్ ఐటికి 20 కోట్లు, ఇన్‌కాయిస్‌కు 15 కోట్లు మాత్రమే కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేసిన ప్రభుత్వం, దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆశించారు. ప్రతి రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తోంది. ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్టుగానే తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనేది తెలంగాణ ప్రభుత్వం డిమాండ్. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 75వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే మొత్తం నిధుల భారాన్ని కేంద్రం భరిస్తుంది. తెలంగాణలోని ప్రాజెక్టులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకున్నా, నీటిపారుదల ప్రాజెక్టులకు, వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. దీంతో కనీసం ఈ నిధుల నుంచైనా ఎక్కువ వాటా పొందేందుకు తెలంగాణ ఎంపీలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత తెరాస ఎంపీలు కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిసి తెలంగాంలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 13వేల 955.35 కోట్లుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ప్రకటించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఊహించినట్టుగానే ఉంది. అయితే తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులకు ఎంతోకొంత వరకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందని, కేటాయింపులు ఉంటాయని ఆశించారు. యూపీఏ రెండేళ్ల క్రితం తెలంగాణకు ఐటిఐఆర్ ప్రాజెక్టు కేటాయించగా, గత మూడు బడ్జెట్‌లలో ఎన్డీయే ప్రభుత్వం ఐటిఐఆర్ ప్రాజెక్టు ఊసెత్తడం లేదు. కేంద్రం ఈ ప్రాజెక్టు చేపడుతుందా? లేదో చెప్పాలని, ఒకవేళ చేపట్టలేని పరిస్థితి ఉంటే రాష్టమ్రే ప్రాజెక్టును సొంతంగా చేపట్టే విషయం ఆలోచిస్తుందని అనేకసార్లు ఐటి మంత్రి కెటిఆర్ బృందం కేంద్రాన్ని కోరారు. అయితే ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఐటిఐఆర్‌కు సంబంధించి ఎలాంటి స్పందన లేదు. ఇదిలావుంటే, కేంద్ర బడ్జెట్‌పై తెరాస ఎంపిలు కవిత, జితేందర్‌రెడ్డి సానుకూలంగానే స్పందించారు. ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులు భారీగానే ఉన్నాయని, అయితే వీటిలో ఏ రాష్టన్రికి ఎంత కేటాయిస్తారనేది తెలీదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఎంత కేటాయిస్తారో చూడాల్సి ఉండదన్నారు. పెద్దగా ఆశలు పెట్టుకోకుండా అదే సమయంలో నిరాశ పడకుండా తెలంగాణను ఆశ నిరాశల్లో ఉంచేట్టుగా కేంద్ర బడ్జెట్ ఉందనే అభిప్రాయం అధికారపక్షం నుంచి వ్యక్తమవుతోంది. ప్రాధాన్యత రంగాలకు నిధుల కేటాయింపు ఎక్కువగా ఉన్నందున ఆయా రాష్ట్రాల ఎంపీల ప్రయత్నాన్ని బట్టి కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంపీలపై ఎక్కువ బాధ్యత ఉంటుందని, కేంద్రంతో సామరస్య పూర్వకంగా ఉంటూ రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా చేయడంలో ఎంపీలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని తెరాస ఎంపీలు అంటున్నారు.