తెలంగాణ

నేడు నామినేషన్ల ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కాకపోవడంతో ఆ పార్టీ ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుండి ఇప్పటికే అనేకమంది నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతుంది. టికెట్ ఖరారైన తరువాత కూడా కొంతమంది నేతలు టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని పసిగట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల జాబితాను మాత్రం గోప్యంగా ఉంచింది. నేరుగా బీఫాంలు మున్సిపల్ కార్యాలయంలోనే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో ఆశావాహుల్లో మరింత టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్‌లో కూడా ఒక్కో డివిజన్‌కు ఐదారుగు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం జాబిత ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 58 డివిజన్లకు గాను అన్ని డివిజన్లలో అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను మాత్రం సిద్ధం చేసింది. శుక్రవారం అభ్యర్థులను ప్రకటించి నేరుగా మున్సిపల్ కార్పొరేషన్‌లోనే బీఫాంలు అందజేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ లాంటి ముఖ్య నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరడంతో ద్వితీయ శ్రేణి నాయకులకు పోటీచేసే అవకాశం ఏర్పడనుంది. కాంగ్రెస్ నుండి పోటీ చేయాలనుకున్న మెజార్టీ నాయకులంతా టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు.