తెలంగాణ

తేడా వస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: వ్యవసాయశాఖ అధికారుల పనితీరు పట్ల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జడ్పీ చైర్మన్ అతిథిగృహంలో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం.. పలువురు ఏడిఏలను వ్యవసాయ శాఖ పనితీరుపై ఆరా తీశారు. అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. గ్రామాల్లో సీడ్ ప్రాజెక్టు ఏ విధంగా నడుస్తోందని.. ఒకవేళ రైతులు సీడ్ ఉత్పత్తి చేస్తే వాటిని ఏ విధంగా మార్కెట్లోకి తీసుకువస్తారని ప్రశ్నించారు.
రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చి వారిని సీడ్ ఉత్పత్తికి ప్రొత్సహిస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏడిఏలు హైమవతి, నిర్మల, యశ్వంత్‌లతో పాటు జెడి ఏ బాలును మంత్రి అడిగిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాగితాలకు మాత్రమే పరిమితం కావడం పద్ధతి కాదని క్షేత్రస్థాయిలో పని ఉండాలని సూచించారు.
ముందుగా పనితీరులో మార్పు తెచ్చుకోవాలని గ్రామాల్లో రైతులతో ఏర్పాటుచేసే సమావేశాలు మొక్కుబడిగా ఉండకూడదన్నారు. బ్యాంకులో వ్యవసాయ రుణాలు పొందిన రైతులకు వందశాతం బీమా చెల్లించాలని, కానీ జిల్లాలో అలాంటి పద్ధతి కనబడడం లేదని.. రైతులు చెల్లించిన బీమా డబ్బుల ఆయా కంపెనీలకు పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో కరువు సహయక చర్యలు అందనున్నాయని అందులో భాగంగా పంట నష్టపరిహరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిజంగా పంట నష్టం జరిగిన రైతులకే పరిహారం అందాలని అలా కాకుండా పైరవీలు చేసి వ్యవసాయం చేయకున్న పంటలు నష్టపోయినట్లు రికార్డులు సృష్టించి పరిహారం అందుకునే విధంగా ప్రొత్సహిస్తే బాగుండదని హెచ్చరించారు.

సోమవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ
అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

రేపటితో ముగియనున్న
బీడీ యాజమాన్యాల సమ్మె

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, ఫిబ్రవరి 22: బీడీ కట్టలపై పుర్రె, క్యాన్సర్ బొమ్మలను ముద్రించాలని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను నిరసిస్తూ బీడీ కంపెనీల యాజమాన్యాలు చేపట్టిన సమ్మె బుధవారంతో ముగియనుంది. ఈనెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు సమ్మెకు దిగుతున్నామని ప్రకటించిన బీడీ యాజమాన్య సంఘం, ఎక్కడికక్కడ కంపెనీలను మూసివేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో లక్షలాది మంది బీడీ కార్మికులు అనునిత్యం రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో బీడీ యాజమాన్యాలపై అటు కార్మిక సంఘాలతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా కంపెనీలు తెరవాల్సిందిగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో 24వ తేదీ అనంతరం కూడా సమ్మెను మరింత కాలం పాటు పొడిగించాలనే యోచనను యాజమాన్యాలు విరమించుకున్నాయని తెలిసింది. 25వ తేదీ నుండి యథాతథంగా కంపెనీలు తెరిచి కార్మికులకు ఆకు, తంబాకును సరఫరా చేయాలని నిర్ణయించాయి. లక్షలాది మంది బీడీ కార్మికులకు ఇది సంతోషాన్ని కలిగించే విషయమై అయినప్పటికీ, ఆంక్షల అమలు విషయంలో కేంద్రం నుండి ఎలాంటి స్పందన కనిపించకపోవడం వారిని ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం తమ ఆందోళనల తాకిడికి తలొగ్గి యాజమాన్యాలు కంపెనీలను తాత్కాలికంగా తెరిచినప్పటికీ, మునుముందు కేంద్రం ఆంక్షల తీవ్రతను తగ్గించని పక్షంలో మళ్లీ కంపెనీలను మూసివేసే ప్రమాదం లేకపోలేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. బీడీ కట్టలపై ఇదివరకు 40శాతం ముద్రిస్తున్న పుర్రె గుర్తుకు తోడు క్యాన్సర్ బొమ్మలను జత చేస్తూ 85శాతం వరకు ఆరోగ్య హెచ్చరికలు ముద్రించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జిఎస్‌ఆర్727(ఇ) పేరిట గత 2014 నవంబర్ మాసంలోనే నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ ఆంక్షలను విధిగా అమల్లోకి తేవాలని ఆంక్షలు విధించారు. అయితే 85శాతం మేర బీడీ కట్టలకు ఇరువైపులా పుర్రె, క్యాన్సర్ బొమ్మలను ముద్రిస్తే బీడీల అమ్మకాలు గణనీయంగా పడిపోవడమే కాకుండా, తమ సంస్థకు సంబంధించిన పేర్లు, ఇతర ప్రకటనలను కూడా ముద్రించుకునేందుకు సరిపడా స్థలం ఉండదని, వీటిని అమలు చేస్తూ బీడీ కంపెనీలను నిర్వహించడం ఆచరణలో సాధ్యం కాదని బీడీ యాజమాన్యాలు కరాఖండీగా తేల్చి చెబుతున్నాయి. దీనిని నిరసిస్తూ తొలివిడతగా ఈ నెల 15 నుండి 24వ తేదీ వరకు సమ్మెను కొనసాగించాయి. ఈ విషయమై కేంద్రం నుండి సానుకూల సంకేతాలు రానప్పటికీ, కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా కంపెనీలు తెరవాలని యాజమాన్య సంఘం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున బీడీ పరిశ్రమ విస్తరించి ఉన్న 16రాష్ట్రాలకు చెందిన ఎంపిలతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, ఆంక్షల తీవ్రతను తగ్గించేలా చర్యలు చేపట్టాల్సిందిగా అభ్యర్థించాలని సమావేశంలో తీర్మానించినట్టు సమాచారం.