తెలంగాణ

పజ్జూరులో చారిత్రక ఆనవాళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని పజ్జూరు గ్రామంలో రెండువేల ఏళ్లనాటి తొలి చారిత్రాక ఆనవాళ్లను వెలికి తీసేందుకు గురువారం పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. ఆర్కియాలజి సర్వే ఆఫ్ ఇండియా అనుమతులతో ఈ తవ్వకాలు చేపట్టారు. తొలి చారిత్రక కాలం నాటి ప్రదేశంగా ఇక్కడ లభించిన ఆధారాలను అధికారులు గుర్తించారు. మండలానికి చెందిన చినసూరారం గ్రామవాసి ప్రస్తుత ప్రభుత్వ ముఖ్య సలహాదారు రామ్‌లక్ష్మణ్ దశాబ్ధన్నరం క్రితం పురావస్తుశాఖ సంచాలకుడిగా పనిచేసిన సమయంలో ఆయన సూచనలతో పురావస్తుశాఖ అధికారులు పజ్జూరు గ్రామంలో తొలి చారిత్రక ఆనవాళ్లను గుర్తించి తవ్వకాలు చేపట్టగా అప్పట్లో ఆర్కియాలాజి సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు అందక నిలిచిపోయాయి. 2015లో భారత ప్రభుత్వం అనుమతితో మళ్లీ ఈ ప్రాంతంలో పరిశోధనలు, త్రవ్వకాలు చేపట్టగా తొలి చారిత్రక యుగం, బృహత్ శిలాయుగం మట్టి పాత్రలు, గాజు పెంకులు, పూసలు లభించాయి. దీంతో తమ పరిశోధనలు ముమ్మరం చేయాలని భావించిన పురావస్తు శాఖ తాజాగా అన్ని అనుమతులతో త్రవ్వకాలు ప్రారంభించింది. రాష్ట్ర పురావస్తుశాఖ అధికారిణి ఎన్‌ఆర్ విశాలాక్షి పజ్జూరు గ్రామానికి వచ్చి సంబంధిత భూమిని పరిశీలించి త్రవ్వకాల కోసం పనులు ప్రారంభించారు. ఇటీవల అధికారుల పరిశీలనలో కొన్నిచోట్ల భూమిలో కుండలు, ఎరుపు,నలుపు పాత్రలు, కొలత పావులు, ఇటుకలు, మట్టిబొమ్మలు, గాజు పెంకులు, తొక్కుడు బిల్లలు లభ్యమయ్యాయి. దీంతో పజ్జూరు గ్రామ శివారులోనే 30 ఎకరాల్లో 60రోజుల పాటు తవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి త్రవ్వకాలు జరిపితే చారిత్రక పూర్వయుగ ఆనవాళ్లు లభించే అవకాశముందన్నారు. సుమారు 2వేల సంవత్సర కాలంనాటి సమాధులను సైతం ఇక్కడ గుర్తించారు. 2వ శతాబ్దం నాటి ముఖ్యమైన వ్యక్తుల సమాధులకు గుర్తుగా మారక శిలలు ఏర్పాటు చేసి ఉంటారని గుర్తించారు.
ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు పాములపర్తి బ్రహ్మచారి, సహాయ సంచాలకులు డాక్టర్ పద్మనాభ, అసిస్టెంట్ డైరక్టర్ పగడం నాగరాజు, సర్పంచ్‌లు ఏనుగు నర్సిరెడ్డి, సింగం సత్తయ్య, సంబంధిత భూముల యజమానులు పాల్గొన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద
విద్యుత్ కేంద్రంగా రామగుండం
తెలంగాణ స్టేజి-1 పనులు ప్రారంభం
గోదావరిఖని, ఫిబ్రవరి 18: విద్యుత్ ఉత్పత్తిలో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ రామగుండం ఎన్టీపిసి ప్రపంచస్ధాయిలో మంచి గుర్తింపు పొందిందని ఎన్టీపిసి సిఎండి గురుదీప్ సింగ్ అన్నారు. గురువారం రామగుండం ఎన్టీసిసిలో సిఎండి పర్యటించి, అనంతరం స్థానిక కాకతీయ ఫంక్షన్‌హాల్ ఆడిటోరియమ్‌లో ఉద్యోగులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఎండిగా బాధ్యతలు చేపట్టిన మెదటి వారంలోనే రామగుండం ఎన్టీపిసికి బిజినెస్ ఎక్స్‌లెన్స్ లభించిందని, ఇవేకాక అనేక అవార్డులను సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా సమిష్టి కృషి వల్లనే రామగుండం ఎన్టీపిసికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ స్టేజి-1కి చెందిన 800మెగావాట్ల రెండు యూనిట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. కొత్త విద్యుత్ యూనిట్లతో రామగుండం ఎన్టీపిసి అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ప్రపంచంలోనే మరింత గుర్తింపు పొందడం జరిగిందన్నారు.
యూనిట్ల శంకుస్థాపనకు మరికొద్ది నెలల్లోనే ఏర్పాటు చేయనున్నామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఎదురవుతున్న పోటీని ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా పర్యవరణానికి, సేఫ్టీ, ఆరోగ్యంకు అధిక ప్రాధన్యత ఇస్తూ విద్యుత్ ఉత్పత్తి జరపాలని సూచించారు.

గోదావరి నీటితో కన్నీళ్లు తుడుస్తా

రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడితేనే నిజమైన అభివృద్ధి
2017 జూన్ నాటికి సిద్దిపేటకు గోదావరి సాగునీరు
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట/చిన్నకోడూరు, ఫిబ్రవరి 18 : తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మారినప్పుడే నిజమైన అభివృద్ధి అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుఅన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేట చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి రంగనాయక సాగర్ ఎడమ కాలువ పనుల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రోడ్లు..్భవనాలు, మురికికాలువలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం అభివృద్ధి కాదని...పది కాలాల పాటు నిలిచిపోయే ...్భవిష్యత్తుతరాల వారికి గుర్తుండే పనులు అభివృద్ధి ఆయన అన్నారు. సాగునీటితోనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. గోదావరి నీరు తీసుకొచ్చి కాలువల ద్వారా నీటిని అందిస్తేనే ఈ ప్రాంతం సస్యశ్యామలవుతుందని, రైతుల కళ్లలో కన్నీళ్లు ఉండవన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రజల అండగా వుండాలని, భూ నిర్వాసితులకు న్యాయం చేస్తానన్నారు. 2017 జూన్ నాటికి గోదావరి నీటిని కాలువల ద్వారా అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భూమి కోల్పోయినప్పుడు ఎవరికైనా బాధగా ఉంటుందని..కొందరికి బాధ కలిగినా తర్వాత వచ్చే సాగునీటితో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూమి ఇస్తున్న రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట ప్రాంత