తెలంగాణ

తెలంగాణ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలకు గౌరవార్హత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలకు గౌరవార్హత లేదని సుప్రీంకోర్టు తరపు న్యాయవాది రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నియామకానికి సంబంధించి దాఖలైన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్‌లే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణకు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలు ఏర్పాటు చేసుకున్నా ఎపి సర్వీస్ నిబంధనలను అనుసరించి నియామకాలు చేపట్టడాన్ని తప్పుపడుతూ దాఖలైన పిటిషన్లపై బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తరపు సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సర్వీస్ నిబంధనలు రూపొందించే సమయంలో ముందు వాటిని హైకోర్టు పరిశీలనకు పంపాల్సి ఉంటుందని తెలిపారు. హైకోర్టును సంప్రదించిన తర్వాతే నిబంధనలు రూపొందించాల్సి ఉందని చెప్పారు. కానీ సర్వీస్ నిబంధనలు రూపొందించే ముందు హైకోర్టును సంప్రదించలేదని తెలియజేస్తూ, అలాంటప్పుడు ఆ నిబంధనలకు గౌరవార్హత ఉండదని కౌన్సిల్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు ప్రస్తుతం జరుగుతున్న నియామకానికి వర్తించవని తెలిపారు. ఎపి జ్యుడీషియల్ సర్వీస్ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్న తర్వాతే జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించే హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జిల నియామక ప్రక్రియను చేపట్టిందని వివరించారు. అనంతరం కేంద్రం వాదన వినేందుకు ఈ నెల 25వ తేదీకి కేసును బెంచ్ వాయిదా వేసింది.

తెలంగాణలో టిడిపిపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఏపి సిఎంను కోరిన తెలంగాణ నేతలు

విజయవాడ, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పునాదులు కదలిపోతున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికై ఇక ప్రత్యేక దృష్టి సారించాలంటూ బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన తెలంగాణ నేతలు పలువురు గట్టిగా కోరారు. తెలంగాణ సిఎల్‌పి నేత రేవంత్‌రెడ్డి, శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ నాయకత్వంలో పలువురు నేతలు సిఎం క్యాంప్ కార్యాలయంలో ఏకాంతంగా కలిసి సుదీర్ఘంగా చర్చించటం జరిగింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, నారాయణఖేడ్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం ఒకరి వెంట మరొకరుగా ఇప్పటికి దాదాపు 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలోకి వలవ వెళ్లడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వలస వెళ్లిన ఎమ్మెల్యేలు తమను టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ స్పీకర్‌కు రాసిన లేఖపై ఏ విధంగా స్పందించాలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తెలంగాణ ప్రాంతంలో తరచు పర్యిటిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచాలని రేవంత్‌రెడ్డి గట్టిగా కోరారు.

దాల్మియా సిమెంట్స్ కేసులో తీర్పు వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 17: జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమన్లను సవాలు చేస్తూ దాల్మియా సిమెంట్స్ ఎండి పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో అనుమానితుడు లేదా నిందితుడు సమన్లను సవాలు చేయడం తగదని ఇడి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసుపై వాదనలు ముగిశాయని, తీర్పును రిజర్వు చేస్తున్నట్లు జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ ప్రకటించారు.
రోజా సస్పెన్షన్‌పై కౌంటర్ దాఖలు చేయండి
అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీనుంచి వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సస్పెన్షన్‌కు సంబంధించి అనుసరించిన విధానాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు కోరింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.