తెలంగాణ

వలేసి పట్టేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్‌వాంటెడ్‌గా ప్రకటించిన సిమి ఉగ్రవాదులు ఒడిశా, తెలంగాణ సిట్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో పట్టుబడ్డారు. మంగళవారం అర్థరాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు మధ్యప్రదేశ్‌లోని రౌర్కెల ఖురేషి మొహల్లాలోని ఓ ఫ్లాట్‌లో పోలీసులు సోదా చేస్తుండగా పోలీసులపై సిమి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. మూడు గంటలపాటు సాగిన హోరాహోరీ కాల్పుల అనంతరం వారిని అరెస్టు చేశారు. అరెస్టైయిన వారిలో ఓ ఉగ్రవాది తల్లి సహా నలుగురు అంజద్ ఖాన్, జకీర్ హుస్సేన్, మహబూబ్, సాదిక్ ఉన్నారు. కాగా వీరితోపాటు మరో ఇద్దరు ఎజాజ్, అస్లాంలు వివిధ ఉగ్రదాడులకు పాల్పడిన నేరాల్లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2013 డిసెంబర్‌లో వీరు జైలునుంచి పారిపోయి తప్పించుకు తిరుగుతున్నారు. నాటినుంచి ఎన్‌ఐఏ వీరిపై మోస్ట్‌వాంటెడ్ నేరస్థులుగా పరిగణిస్తూ, ఒక్కొకరిపై పది లక్షల రివార్డు ప్రకటించింది. కాగా 2015 ఏప్రిల్ 1న నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు ఇద్దరు సిమి కార్యకర్తలు కంటబడిన విషయం తెలిసిందే. వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపై కాల్పులకు తెగబడి పరారైన సంగతి తెలిసిందే. ఆ కాల్పుల్లో ఒక హోంగార్డు, కానిస్టేబుల్ మృతి చెందగా ఎస్‌ఐ సిద్దయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఈమేరకు పోలీసులు తిరిగి కూంబింగ్ నిర్వహించగా మోత్కూరు మండలం జానకిపూర్ వద్ద సిమి ఉగ్రవాదులు తారసపడటం, సిఐ బాలగంగారెడ్డి ఆధ్వర్యంలో హోరాహోరీ కాల్పులు జరగడం తెలిసిందే. అప్పటి కాల్పుల్లో సిమి ఉగ్రవాదులు ఎజాజ్, అస్లాం మృతి చెందారు. నాటినుంచి మహబూబ్, జకీర్‌ఖాన్, అంజద్ ఖాన్, సాదిఖ్ తప్పించుకు తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బెంగుళూరులో వీరి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2014 ఫిబ్రవరి ఒకటిన కరీంనగర్‌లో జరిగిన ఓ బ్యాంకు దోపిడీ, బెంగుళూరు- గౌహతి బాంబు పేలుడు, 2014 జులై 10న జరిగిన మహరాష్టల్రో పేలుళ్ల ఘటనలో వీరు నిందితులని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 14 డిసెంబర్ 2014లో బిజ్నూరులో జరిగిన పేలుళ్ల ఘటనలోనూ వీరు నిందితులని ఒడిశా డిజిపి కెబి సింగ్ పేర్కొన్నారు. 2014లో పేలుళ్లకు సంబంధించి మిశ్రమాన్ని కలుపుతుండగా సంభవించిన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఉగ్రవాది తల్లి నజ్మా నాటినుంచి అదృశ్యమైంది. తెలంగాణ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో ఆమె ఈ నలుగురు ఉగ్రవాదులతో కలసి ఉంటుందని తెలిసింది. దీంతో ఖాండ్వాలోని ఓ ఫ్లాట్‌లో తలదాచుకుంటున్న వీరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారు.
డిజిపికి కేంద్ర హోంమంత్రి ప్రశంసలు
ఒడిశా పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి సిమి ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈమేరకు తెలంగాణ డిజిపి కె అనురాగ్ శర్మను అభినందించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తెలంగాణ పోలీసులు జరుపుతున్న కృషి ప్రశంసనీయమన్నారు. తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసిన తెలంగాణ పోలీసుల స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల పోలీసులు కృషి చేయాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. నేరాల అదుపు, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణలో తెలంగాణ పోలీసుల పాత్ర అమోఘమని కొనియాడారు.