తెలంగాణ

మూడు భాషలు, నాలుగు లిపుల్లోకి గోండి కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఇతర భాషలలోకి అనువాదాలు చాలా తక్కువ అవుతున్న వేళ గోండి భాషా కథలను ఆంగ్లం, హిందీ, తెలుగు భాషలలోకి అనువదించి ప్రచురించడం ముదావహమని హైదరాబాద్ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు పెరియసామి అన్నారు. సైన్స్‌లో జరిగే ఆవిష్కరణలు, ప్రయోగాలు ప్రజలకు ఉపకరించినట్లే సామాజిక శాస్త్రాల ఫలితాలూ ప్రజలకు అందాల్సి ఉందని ఆయన తెలిపారు. దళిత, ఆదివాసీ అధ్యయన కేంద్రం (సిడిఎఎస్‌టి) మంగళవారం నిర్వహించిన వర్క్‌షాప్ ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు. ఆచార్య ఆర్.ఎస్. సర్రాజు మాట్లాడుతూ ఆదివాసీ విజ్ఞానం, జీవితం, సంస్కృతిలో భాగమైన కథలపై విస్తృతంగా పరిశోధన జరగాల్సి ఉందని అన్నారు. హైదరాబాద్ విశ్వ విద్యాలయం, పరీక్షాధికారి ఆచార్య వి. కృష్ణ ప్రసంగిస్తూ అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న గోండి భాషకు ‘సిడాస్ట్’ చేయూతనిచ్చి కాపాడాలని అన్నారు.‘సిడాస్ట్’ విజిటింగ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు ప్రసంగిస్తూ అంతర్జాతీయ భాష ఇంగ్లీషులోకి, జాతీయ భాష హిందీలోకి, ప్రాంతీయ భాష తెలుగులోకి, ఆదివాసీ లిపిలో కూడా అచ్చయ్యే ఈ కథలలో వందేళ్ళ గోండు సంప్రదాయం, చరిత్ర దాగి ఉన్నాయని అన్నారు. కాగా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు పరిశోధనా ఫలితాలు చేరి అభివృద్ధికి దోహదపడాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. మూడు భాషలు, నాలుగు లిపుల్లోకి అనువాదం జరగడం మొదటిసారి అని వారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ గూడూరు మనోజ , గోండీ పండితులు కోట్నక్ జంగు, అర్క మాణిక్‌రావు, టి. దేవ్‌రావు, కె. వినాయక్‌రావు, డాక్టర్ జి. రాజు పాల్గొన్నారు.

దళిత, ఆదివాసీ అధ్యయన కేంద్రం మంగళవారం నిర్వహించిన వర్క్‌షాప్ ప్రారంభ సభలో పాల్గొన్న ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, సెంట్రల్ వర్శిటీ ప్రొ. పెరియస్వామి,
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కృష్ణ