తెలంగాణ

మేడారం జాతరకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు 102 కోట్ల రూపాయలను కేటాయించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. దాదాపు 10వేల మంది పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. 50మంది డిఎస్పీలు, 150 మంది సి ఐలు, 200 మంది ఎస్సైలు, మిగతా పోలీసు సిబ్బంది జాతర బందోబస్తు నిర్వహిస్తారు. 15 ప్రాంతాల్లో 100 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అమ్మవార్ల గద్దెల చుట్టూ మరో 50 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. కోట్లాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో 3,450 మీటర్ల మేర స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. రోజుకు 25లక్షల మంది, గంటకు లక్ష మంది స్నానాలు చేసుకునే వీలుగా స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు గాను ప్రత్యేక షెడ్‌లను సమకూర్చారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య, ఆరోగ్య శాఖ 800 మంది సిబ్బందితో విధులు నిర్వహించనున్నారు. 120 మంది వైద్య బృందం, మరో 40 మంది మహిళా డాక్టర్లు, 104 వాహనాలు 14 అందుబాటులో ఉంటాయి. 17వేల మరుగుదొడ్లు నిర్మించారు. 4వేల రేకుల మరుగుదొడ్లు, 13వేల తడకల మరుగుదొడ్లు, 300 శాశ్వత మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. జాతరను 38 సెక్టార్లుగా విభజించారు. 38 సెక్టార్లకు గాను 132 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. వీరంతా వాకీటాకీలతో విధులు నిర్వహిస్తారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు వాకీటాకీల ద్వారా సమన్వయం చేసుకొని సమస్యలు తలెత్తకుండా చూస్తారు. మహాజాతర కావడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా 2,200 మంది కార్మికులను, 600 మంది అధికారులను నియమించారు.
జాతరలో 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండే విధంగా మూడున్నర కోట్ల రూపాయలతో 120 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 150 మంది విద్యుత్ సిబ్బంది విధుల్లో ఉంటారు. మూడు సబ్‌స్టేషన్లను నిర్మించారు. ఆర్టీసీ అధికారులు కూడా దాదాపు పాతిక లక్షల మంది భక్తులను జాతరకు చేరవేసే లక్ష్యంగా 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 50 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్ నిర్మించారు. జాతర సమీపంలోని చింతల క్రాస్ నుండి జాతర వరకు బస్సులు షెటిల్ సర్వీసు చేస్తాయి. జాతర అంటేనే మద్యం కావడంతో ప్రత్యేకంగా ఎక్సైజ్ అధికారులు వారం రోజుల వరకు 22 మద్యం షాపులకు లైసెన్స్ మంజూరు చేశారు. ఒక్కో మద్యం షాపునకు 9వేల రూపాయలు అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

భాష ఏదైనా మనసుకు ఉల్లాసం కలిగించేదే షాయరీ

జాతీయ స్థాయి ముషాయిరాలో ఎంపి కవిత

జగిత్యాల, ఫిబ్రవరి 13: భాష ఏదైనా మనసుకు ఉల్లాసం కలిగించేదే షాయరీ అని నిజామాబాద్ ఎంపి కె. కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల ఖిల్లాలో శనివారం జాతీయ స్థాయి ముషాయిరా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కవిత ప్రసంగిస్తూ ఉర్దూ భాషలో షాహిరీలను ఆస్వాదించడం ఆనందకరంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చేసిన ముషాయిరా కవి, పండితులను ఆమె అభినందించారు. జగిత్యాల మైనార్టీ నాయకులు అడిగి సమస్యలకు సమాధానం ఇస్తూ త్వరలోనే జగిత్యాల ఖిల్లాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ ల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే షాదీముబారక్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ఉర్దూ భాష సంరక్షణ కోసం మైనార్టీలకు ప్రభు త్వం పెద్దపీట వేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలాలకు పదును పెట్టి పాలకుల్లో కదలిక తెచ్చిన కవి, పండితులు, కళాకారులు బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు తన సంపూర్ణ సహకారాన్ని అందించాలన్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల మైనార్టీలతో తన జీవిత కాలం దోస్తానా ఉంటుందన్నారు. ఖిల్లా అభివృద్ధి కోసం ఎంపి కవిత సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టిఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ మైనార్టీల సంక్షేమానికి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు తుచతప్పకుండా నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. అలాగే ఖిల్లా అభివృద్ధికి తన వంత సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కవి, పండితులు అబ్ధుల్ మాలిక్, మహ్మద్ మహమూద్, అలీ అఫ్సర్, మున్నా, ఖాజీం అలీ, సయ్యద్ జమీల్, మహ్మద్ సలావొద్దీన్, మీర్ ఖాజీం అలీ తదితరులు పాల్గొన్నారు.

కాటన్ మరమగ్గాల కార్మికుల సమ్మె ముగిసింది

ఫలించిన చర్చలు, కుదిరిన కూలీ ఒప్పందం

సిరిసిల్ల, ఫిబ్రవరి 13: కూలీ పోరాటంలో భాగంగా కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కాటన్ పవర్‌లూం కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె పరిష్కారమైంది. ఈమేరకు శనివారం కార్మిక సంఘాల ప్రతినిధులు, యజమానుల సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. నూతన కూలీ ఒప్పందం జరిగి, ఇరువర్గాలు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. స్థానిక చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది. గతంలో 10 పిక్కులకు 32 పైసల కూలీ ఇవ్వగా, సమ్మె సందర్భంగా కార్మిక సంఘాలు పది పిక్కులకు 45 పైసల కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అయితే ఈనెల ఒకటి నుండి కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టగా, రెండు పైసల కూలీ మాత్రమే పెంచడానికి యజమానులు ముందుకు రాగా, పలు దఫాలుగా జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈమేరకు పది పిక్కులకు 36 పైసల కూలీ ఇవ్వడానికి యజమానులు ముందుకు రాగా, దీనికి కార్మిక సంఘాలు అంగీకరించాయి. దీని ప్రకారం మీటరు గుడ్డ ఉత్పత్తి చేసిన కార్మికుడికి గతంలో కంటే 20 పైసల కూలీ అదనంగా పెరిగింది.
ఈ కూలీ ఒప్పందం ఈనెల 15 నుండి అమలులోకి వస్తున్నట్టు తెలిపారు. అలాగే ఒప్పందం రెండేళ్లపాటు అమలులో ఉంటుందని ప్రకటించారు. కాగా, లాల్ బావుటా చేనేత పవర్ కార్మిక సంఘం (ఎఐటియుసి), జిల్లా పవర్‌లూం వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సమ్మె పోరాటం చేయగా, కూలీ ఒప్పందం కుదరడంతో సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ చర్చల్లో ఎఐటియుసి పన సామల మల్లేశం, పోలు కొమురయ్య, వావిలాల వెంకటేశం, సిఐటియు పక్షాన మూషం రమేశ్, యజమానుల పక్షాన సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు బూట్ల సుదర్శన్, కార్యదర్శి కోడం అశోక్, వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం నాయకులు అన్నల్‌దాస్ యాదగిరి, కోడం సత్యనారాయణ, వడ్లకొండ ఆనందం, గౌడ రాజు తదితరులు పాల్గొన్నారు.