తెలంగాణ

బల్దియా ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: రోజురోజుకి సరికొత్త మార్పులతో అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం సిద్ధమైంది.
గతంలో మన బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించటం చూశాం. కానీ కాలక్రమేనా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను విజయవంతంగా వినియోగిస్తున్న ఎన్నికల సంఘం ఇపుడు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్లను నేరుగా రిటర్నింగ్ అధికారికి అందజేసేవారు. కానీ దేశంలోనే ఎపుడు, ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మొట్టమొదటి సారిగా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ విధానాన్ని ప్రవేశపేట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 150 మున్సిపల్ డివిజన్లకు త్వరలో జరగనున్న ఈ ఎన్నికల్లో తొలుత ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన రెండు డివిజన్లలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్‌లైన్‌లోనే సమర్పించే అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి మంగళవారం ఎన్నికల సిబ్బందికి నగరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వివరించారు. పోటీ చేయదల్చిన అభ్యర్థి రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ అందుబాటులో ఉంచే నామినేషన్ ఫారంలో తన వివరాలను పొందుపర్చి సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ప్రయోగాత్మకంగా ఈ- వైద్య

హైదరాబాద్, డిసెంబర్ 1: ఆధునిక పరికరాలతో గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ-వైద్య పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్టు ఈ-వైద్య ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ఐటి మంత్రి కె తారక రామారావు, వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలకు తెలిపారు. ఆధునిక పరికరాలతో గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో అందించే సేవలను వివరించారు. తమ కంపెనీ ఆరోగ్య కేం ద్రాల్లో ఎక్స్‌రేతో పాటు అనేక రకాలైన జబ్బులకు డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ- వైద్య సంస్థలకు నాలుగు చోట్ల పైలట్ ప్రాజెక్టు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో సేవలు అందించాలని మంత్రులు కోరారు. పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు సాధించాలని కోరారు.