తెలంగాణ

8గేట్ల ద్వారా నిజాంసాగర్ నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, సెప్టెంబర్ 29: నిజామాబాద్ జిల్లా రైతుల వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో గురువారం సాయం త్రం వరకు కూడా ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఐదవ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు గోదావరిలోకి 8గేట్లను ఎత్తినీటిని విడుదల చేశారు. సాయంత్రం ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో ప్రాజెక్ట్ గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00అడుగుల నీటిని జలాశయంలో నిలువ ఉంచుతూ, సాయం త్రం వరకు జలాశయంలో వస్తున్న నీటిని 8గేట్ల ద్వారా విడుదల చేశారు. ప్రాజెక్ట్ జలాశయంలో ఉద యం పూట ఇన్‌ప్లో 94,500 క్యూ సెక్కుల వరదనీరు రావడంతో ప్రాజెక్ట్ 8వరదగేట్ల ద్వారా 79,350క్సూసెక్కుల నీటిని మంజీరనది ద్వారా గోదావరిలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ డిప్యూటి ఇఇ సురేష్‌బాబు తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల సందడితో ప్రాజెక్ట్ కళాకళలాడుతోంది. ఉదయం నుండి సాయం త్రం వరకు పర్యాటకులు భారీ సంఖ్యలో ప్రాజెక్ట్‌ను చూసేందుకు వస్తున్నారు.

చిత్రం.. నిజాంసాగర్ ప్రాజెక్ట్ 8గేట్లను ఎత్తిన దృశ్యం