తెలంగాణ

ముస్తాబాద్ పెద్దచెరువుకు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్తాబాద్, సెప్టెంబర్ 27: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లో 700 ఎకరాల సా మర్థ్యం గల పెద్దచెరువు జలకళ మూడు రోజులు ముచ్చటగొల్పి, నాల్గవ రోజున చెరువు కట్ట తెగిపోయింది. శిఖంలో చుక్కనీరు లేకుండా పోయింది. వరద ఉద్ధృతి భారీ నష్టాన్ని మిగిల్చింది. అదృష్టవశాత్తు మంగళవారం తెల్లవారుజామున చెరువుకట్ట తెగిపోవడం, జనసంచారం లేని సమయం కావడంతో ఎలాంటి జననష్టం వాటిల్లలేదు. 18 ఏళ్ల తర్వాత నిండిన పెద్దచెరువు, నీటి పారుదల శాఖ నిర్వహణ లోపం వల్ల తెగిపోవడంపై గ్రామస్థులు దిగ్భ్రాంతి చెందడమేగాక తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో గ్రామశివారులో ఉన్న పెద్దచెరువు వైపు నుంచి పెద్దశబ్ధం రావడంతో గాఢనిద్రలో ఉన్న ఎస్సీ కాలనీవాసులు ఉలిక్కిపడి లేచారు. చెరువు తెగిపోయి ఉద్ధృతితో వరదనీరు రావడాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. చెరువు కట్ట మధ్యలో సుమారు 100 మీటర్ల మేర కట్ట తెగిపోయి, 40 నిమిషాల్లోనే చెరువు ఖాళీ అయిపోయింది. ముస్తాబాద్-సిద్దిపేట ప్రధాన రహదారి, పోత్గల్ పరిధి గనె్నవాని పల్లె రహదారి కొట్టుకుపోయింది. వరద ఉద్ధృతికి ముస్తాబాద్, పోత్గల్ గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల పంటలు నేలమట్టమయ్యాయి.

మంగళవారం తెల్లవారుజామున తెగిన ముస్తాబాద్ పెద్దచెరువు