తెలంగాణ

సిద్దిపేటలో సెంట్రల్ అకాడమీ ఏర్పాటుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 27 : సిద్దిపేటలో హెచ్‌సిఎ ఆధ్వర్యంలో సెంట్రల్ అకాడమీ ఏర్పాటు చేసి ఈప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి కృషిచేస్తానని హెచ్‌సిఎ అధ్యక్షు డు, మాజీ టెస్టు క్రికెటర్ అర్షద్ ఆయూబ్ వెల్లడించారు. సిద్దిపేట మినీస్టేడియాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారని కితాబునిచ్చారు. ఈ మైదానంలో రంజీపోటీలు నిర్వహిస్తానని హామీనిచ్చారు.
రంజీపోటీలు నిర్వహించేందుకు అనుగుణంగా మైదానాన్ని తీర్చిదిద్దేందుకు హెచ్‌సిఎ పక్షాన కృషిచేస్తామన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట మినీస్టేడియాన్ని మంగళవారం హెచ్‌సిఎ ప్రధాన కార్యదర్శి జాన్‌మనోజ్, ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డితో కలసి ఆయన సందర్శించారు. గ్రౌండ్ పచ్చికతో చక్కగా ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా అర్షద్ ఆయూబ్ మాట్లాడుతూ మైదానాన్ని సరైన లెవెల్‌లో చక్కగా తీర్చిదిద్దారని, పిచ్ బాగుందన్నారు. హెచ్‌సిఎ పక్షాన క్యూరేటర్‌ను పంపించి మైదానంలో చుట్టూ 65 మీటర్లు ఉండేలా మైదానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలికితీసేందుకు కృషిచేస్తానన్నారు. రాష్ట్రంలో, జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం తమిళనాడు తరహాలో టిహెచ్‌పిఎల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మహబుబ్‌నగర్, నిజమాబాద్, వరంగల్ జిల్లాల్లో క్రికెట్ అభివృది విషయమై పర్యటించినట్లు తెలిపారు. పైరవీలకు తావులేకుండా ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు.

మినీస్టేడియాన్ని పరిశీలించిన అర్షద్ ఆయూబ్, జాన్‌వెస్లి తదితరులు