తెలంగాణ

సిద్దిపేట మున్సిపాల్టీకి స్వచ్ఛ పురస్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 27: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అమలులో భాగంగా ఆదర్శంగా నిలిచి పరిశుభ్ర పట్టణంగా ఎంపికైన స్వచ్ఛ పురస్కార్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్ రాహుల్ ప్రతాప్‌సింగ్ మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సుకు, కమిషనర్ రమణాచారికి అందజేశారు. ఇక్కడి శివమ్స్ గార్డెన్‌లో మంగళవారం జరిగిన స్వచ్ఛ్ఫురస్కార్ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ సాధించాలన్న లక్ష్యంతో అక్టోబర్ 2 2014లో ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారన్నారు. దేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టి బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో ఈ పథకం అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 5 మున్సిపాల్టీలు స్వచ్ఛపురస్కార్ కోసం ఎంపిక చేశామన్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా సిద్దిపేట గుర్తింపు పొందిందన్నారు. తడి, పొడి చెత్త సేకరణలో, చెత్తను సేంద్రియ ఎరువు వినియోగంలో సిద్దిపేట ముందుందన్నారు. మొక్కల పెంపకంలో సైతం సిద్దిపేట ముందువరుసలో ఉందన్నారు. దేశంలోని వివిధ మున్సిపాల్టీల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సిద్దిపేట ముందంజలో ఉందన్నారు. సిద్దిపేటకు ఓడిఎఫ్ పురస్కారం అందించామన్నారు. ఈ ప్రశంసాపత్రం 6 నెలలపాటు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మరోసారి పట్టణాన్ని తనిఖీలు చేసి ఓడిఎఫ్ అమలు, పట్టణ శుభ్రతపై పరిశీలిస్తారన్నారు. అనంతరం పర్మినెంట్‌గా ఓడిఎఫ్ పట్టణంగా గుర్తింపు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజనర్సు, కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్లు వేణుగోపాల్‌రెడ్డి, మల్లిఖార్జున్, వెంకట్‌గౌడ్, ప్రభాకర్, రవీందర్, బాల్‌లక్ష్మి, ఉమారాణి, నాయకులు రామన్న, రాజ్‌నరేందర్, ఆనంద్, నాగరాజు పాల్గొన్నారు.

స్వచ్ఛ పురస్కార్‌ను అందిస్తున్న కేంద్ర ప్రతినిధి రాహుల్ ప్రతాప్‌సింగ్