తెలంగాణ

నరుూంతో లింక్‌లున్న నేతలకు ప్రభుత్వం షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 27: గ్యాంగ్‌స్టర్ నరుూంతో సంబంధాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార, విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వపరంగా భద్రతాపరమైన అంశాలపై కోత పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ టిఆర్‌ఎస్ నేత రివాల్వర్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ రివాల్వర్‌ను పోలీస్ శాఖ స్వాధీనపరుచుకోవాలంటూ జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే కలెక్టర్ ఆదేశాలపై అధికారికంగా సమాచారం వెల్లడించేందుకు అధికారులు ఇష్టపడలేదు. కాగా, గ్యాంగ్‌స్టర్ నరుూంతో నేరపూరిత సంబంధాలున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులకు, అధికార, విపక్ష పార్టీల నేతలకు సైతం ఇదే రీతిలో వ్యక్తిగతంగా ఆయుధాలు కలిగి ఉండేందుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని సమాచారం. నరుూం వంటి గ్యాంగ్‌స్టర్‌తో నేరమయ సంబంధాలు నెరపిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రజాధనం వెచ్చించి ప్రభుత్వం భద్రత కల్పించడం, ఆయుధ లైసెన్స్‌లు ఇవ్వడం సరైంది కాదన్న ఆలోచనతో పాటు కేసుల విచారణ సజావుగా సాగేందుకు వీలుగా వారి గన్ లైసెన్స్‌లను రద్దు చేసి, గన్‌మెన్లను సైతం ఉపసంహరించుకునే చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది.