తెలంగాణ

అంతం కాదిది... ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారులు వేగవంతం చేశారు. రెండోరోజు మంగళవారం సాయంత్రానికి 204 అక్రమ కట్టడాలను నేలమట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఫోన్‌లో జనార్దన్‌రెడ్డితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అయితే అనేక చోట్ల ఆ ఇళ్ళలో నివసిస్తున్న వారు కూల్చి వేతలకు అడ్డుతగిలారు. దీంతో జిహెచ్‌ఎంసి సిబ్బందికి, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనేకచోట్ల పోలీసుల సహాయంతో కూల్చి వేతలు చేపట్టారు. కూల్చి వేతతో రోడ్డున పడిన పేద కుటుంబాలకు 3,637 ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు చెప్పారు. జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, నీటి పారుదల, పోలీసు శాఖల అధికారులతో కూడిన 24 బృందాలు కూల్చి వేత పనుల్లో నిమగ్నమయ్యాయి.
విపక్షాలు సహకరించాలి
అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్రతిపక్షాలు సహకరించాలని, అడ్డుకోరాదని ప్రభుత్వం ఇదివరకే ప్రజాప్రతినిధులను కోరింది. దీంతో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా లేదు. అక్కడక్కడ బాధితులే అడ్డుపడడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంత కాలం విద్యుత్తు, నీటి బిల్లులు చెల్లించామని, పక్కా రిజిస్ట్రేషన్ ఉన్నదంటూ కొంతమంది బాధితులు అధికారులకు డాక్యుమెంట్లు చూపించారు. వాటిని పరిశీలించిన అధికారులు భవిష్యత్తులో ఎప్పుడైన వరదలు బీభత్సం సృష్టిస్తే, ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది కాబట్టి, తాము ప్రత్యామ్నాయంగా వాంబే పథకం కింద ఇచ్చే ఇళ్లను తీసుకోవాలని సూచించారు.
రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో 8 అక్రమ కట్టడాలను జిహెచ్‌ఎంసి అధికారులు కూల్చి వేయించారు. ఆరంఘర్ చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చి వేశారు. దుర్గానగర్, అత్తాపూర్, శివరాంపల్లిలోని అక్రమ కట్టడాలను కూల్చి వేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మారుతీ నగర్, గాజుల రామారం, జైశంకర్ నగర్ నాలాలు కబ్జా చేసి నిర్మించిన ఇళ్ళను కూల్చి వేశారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, జిహెచ్‌ఎంసి ఉప కమిషనర్ మమత, మున్సిపల్, రెవెన్యూ అధికారుల వద్ద బాధితులు తమ గోడు వినిపించారు.
బాలానగర్‌లోని నాలాలపై నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నప్పుడు స్థానికులకు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. గచ్చిబౌలిలోనూ పలు అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. అల్లంతోట బావిపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. బంజారా లేక్ చుట్టూ కబ్జాకు గురైన ప్రాంతాలను జిహెచ్‌ఎంసి అధికారులు కూల్చి వేయిస్తున్నారు. లేక్ చుట్టూ భూమి కబ్జాకు గురికావడంతో లేక్ కుంచించుకుపోయి, ఇటీవల కురిసిన వర్షాలతో నీరు రోడ్డుపై ప్రవహించింది. కర్మన్‌ఘాట్‌లోని ఉదయ్ నగర్ కాలనీలో నాలాపై నిర్మించిన ఇళ్ళను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ సందర్శించి, వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించారు. రామాంతాపూర్ వద్ద చెరువు సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రహరీగోడను కూల్చి వేశారు. మల్కాజిగిరిలోని షిరిడి నగర్‌లో, ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ, లక్ష్మీనగర్‌లో కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఎసిపి సంతోష్ కుమార్ అధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. ఇంకా మీర్‌పేట్, శేరిలింగంపల్లి నాలాలపై ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. చాదర్‌ఘాట్ మూసానగర్ బస్తీలో ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. ఆదర్శనగర్, శాంతి నగర్, దీప్తిశ్రీనగర్‌లో నాలాకు ఇరువైపుల కిలో మీటర్ పొడగునా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వాహెద్ నగర్, శంకర్ నగర్, పద్మ నగర్ తదితర ప్రాంతాల్లో అధికారుల సర్వే చేస్తూ కొంత మందికి నోటీసులు అందజేశారు.
ఇంతటితో ఆగదు
అక్రమ కట్టడాల కూల్చివేత ఇంతటితో ఆగదని, మరింత వేగవంతం చేస్తామని జిహెచ్‌ఎంసి మేయర్ బొం తు రాంమోహన్ తెలిపారు. మొత్తం 3639 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు.

గాజుల రామారంలో ఆక్రమణలను తొలగిస్తున్న దృశ్యం

నగర శివారులలో ఆక్రమణలను తొలగిస్తున్న దృశ్యం