తెలంగాణ

నవంబర్ 11, 12లలో గ్రూప్ 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో తొలి భారీ రిక్రూట్‌మెంట్ నిర్వహణకు పబ్లిక్ సర్వీసు కమిషన్ సన్నద్ధమవుతోంది. గ్రూప్-2 స్థాయిలోని 1032 పోస్టుల భర్తీకి 7,91,964 దరఖాస్తులు వచ్చాయి. తొలుత 439 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందనగా 5,62,715 దరఖాస్తులు రాగా, తర్వాత ఇచ్చిన అదనపు 593 పోస్టులకు మరో 2,29,249 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం ఇంత వరకూ కమిషన్‌కు 7,91,964 దరఖాస్తులు వచ్చాయని కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ పేర్కొన్నారు. పరీక్షను నవంబర్ 11 , 13 తేదీల్లో నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. జనవరి నాటికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తే గ్రూప్-1 నోటిఫికేషన్‌కు ఏర్పాట్లు చేయవచ్చని కమిషన్ యోచిస్తోంది. ఇంత వరకూ వచ్చిన దరఖాస్తుల్లో పురుషులు 4,87,929 మంది మహిళలు 3,04,028 మంది దరఖాస్తు చేశారని చెప్పారు. ఏపి నుంచి 11346 దరఖాస్తులు, తెలంగాణా నుంచి 778813 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.