తెలంగాణ

తెలంగాణలో బలంగా నైరుతీ రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో నైరుతీ రుతుపవనాలు బలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. అలాగే తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించి ఉందని వెల్లడించారు. అదే సమయంలో బంగాళాఖాతం ఉత్తర ప్రాంతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో 3.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల తుపాన్ ద్రోణి ఏర్పడి ఉందని వివరించారు. దీని ప్రభావం వల్ల అక్టోబర్ 1 న కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. అలాగే వచ్చే నాలుగురోజుల్లో ఒడిషా, తూర్పు భారత్ రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, విదర్భ, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి శాస్తవ్రేత్త శంభు రవీందర్ తెలిపారు. గత 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లోని యలమంచిలిలో 8 సెంటీమీటర్లు అనకాపల్లిలో 7, చోడవరం నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, నవీపేట, వర్ని, ఖమ్మం జిల్లాలోని మణుగూరులలో ఐదేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే విశాఖ, విజయనగరం, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యాయి. వచ్చే 24 గంటల్లో ఎపికి కాని తెలంగాణకు కానీ వర్షసూచన ఏమీ ఐఎండి ఇవ్వలేదు. వచ్చే రెండుమూడు రోజుల్లో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.