తెలంగాణ

సిఎం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 26: నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, అందని ప్రభుత్వ పథకాలు, భారంగా మారిన కుటుంబపోషణ వెరసి సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నిండిన జలాశయాలతోపాటు తెగిన మిడ్‌మానేరు కట్టను పరిశీలించేందుకు సిఎం కెసిఆర్ జిల్లాకు వచ్చారు. ముందుగా జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన కలెక్టరేట్‌లో వరద ఉధృతి, చేపట్టిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ ద్వారా జలాశయాలను పరిశీలించేందుకు కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చి, కాన్వాయ్‌లోకి చేరుకుంటుండగా పక్కనే వేచి ఉన్న మహాదేవ్‌పూర్ మండలం ఎడపెల్లి గ్రామానికి చెందిన పర్వతం గోపి (25) అనే యువకుడు ఒక్కసారిగా ముందుకువచ్చి, తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి, తాను చనిపోతున్నానని కేకలు వేశాడు. దీనిని గమనించిన పోలీసులు అతనిని సమీపించి, పురుగుల మందు డబ్బాను లాక్కొని, వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
యువకుడు తనవెంట తెచ్చుకున్న సర్ట్ఫికెట్లు సంఘటనా స్థలంలోనే వదిలివెళ్ళగా, ఎంపి వినోద్‌కుమార్ వాటిని గమనించి వాటితో సదరు వ్యక్తి వివరాలు సేకరించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి సంఘటనకు గల కారణాలు బాధితున్ని అడిగి తెలుసుకున్నారు. తాను పట్ట్భద్రున్నైనా నిరుద్యోగంతో ఉన్నానని, తన తండ్రి వయస్సు 65 ఏళ్ళు దాటినా, ఆధార్‌కార్డులో మాత్రం 22 ఏళ్ళుగా ముద్రించగా, తండ్రికి పింఛన్ రావడంలేదని, అధికారులను పలుమార్లు వేడుకున్నా కనికరించడం లేదని, తనకు ముగ్గురు అక్కా, చెల్లెళ్లున్నారని, రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో తన కుటుంబం ఉండగా, ప్రభుత్వ పథకాలేవి తమ కుటుంబ దరి చేరలేదని, దీనిపై తాను ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు రాగా, ముఖ్యమంత్రి వస్తున్నట్లు తెలుసుకుని, తన బాధను ఇలా సిఎంకు తెలియజేయాలని అనుకున్నానని చెప్పినట్లు సమాచారం.
కాగా, పూర్తి భద్రత నడుమ ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుండగా, సిఎం కూర్చుని ప్రయాణించే వాహనం సమీపానికి యువకుడు చేరుకుని ఆత్మహత్యయత్నం చేసుకోవడంపై పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందనే వ్యాఖ్యలు వెల్లువెత్తడం గమనార్హం.

చిత్రం.. సిఎం కాన్వాయ్ సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పర్వతం గోపి