ఆంధ్రప్రదేశ్‌

ఎస్పీజి అధీనంలో ఏపి సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 15: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి భద్రత పెరగనుంది. ఈ కార్యాలయం శుక్రవారం నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధీనంలోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీఎఫ్ డిజి మాదిరెడ్డి ప్రతాప్, డిఐజి ఏసురత్నం, కమాండెంట్ డాక్టర్ కెఎన్ రావు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక బలగాలతో రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేయనున్నారు. ఒకటో బ్లాక్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటుతో పాటు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌లు, ఫ్లోరింగ్‌లు విదేశీ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నాయి. అన్ని బ్లాక్‌లలో మంత్రుల పేషీలు దాదాపు పూర్తికావచ్చాయి. దసరా నుంచి ప్రభుత్వ కార్యకలాపాలను సచివాలయం నుంచే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మంత్రులు, వివిఐపిలతో పాటు సిఎం కార్యాలయం కూడా తుది రూపు సంతరించుకోవటంతో ప్రత్యేక బలగాలు రంగంలో దిగనున్నాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సచివాలయంలోని తన పేషీలోనే కొద్ది రోజులుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. యంత్రాంగం యావత్తు వెలగపూడి తరలిరావటంతో సచివాలయానికి మరింత భద్రత పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సచివాలయాన్ని ఎస్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి.

పింజరికొండ జలపాతంలో ఇద్దరు గల్లంతు
అడ్డతీగల, సెప్టెంబర్ 15: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో గురువారం జలపాతం వద్ద స్నానం చేస్తున్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అడ్డతీగల మండలంలోని పింజరికొండ జలపాతం వద్దకు గురువారం జిల్లా కేంద్రం కాకినాడ నుండి కొందరు యువకులు విహారయాత్రకు వచ్చారు. భోజనాల అనంతరం వారంతా జలపాతంలో స్నానం చేస్తుండగా రాజేంద్రకుమార్, వీరరామకృష్ణ అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సహచరులు ఇచ్చిన సమాచారం మేరకు అడ్డతీగల పోలీసులు రంగంలోకి దిగి గాలింపుచేపట్టారు. పింజరికొండ నీటి ప్రవాహం ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టుకు చేరుకుంటుంది. దీనితో ప్రాజెక్టు వరకువున్న వాగు వెంబడి గల్లంతయ్యిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ధవళేశ్వరం వద్ద నిలకడగా గోదావరి

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 15: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. నది ఎగువ పరీవాహక ప్రాంతంతోపాటు తూర్పు కనుమల్లోనూ భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ఉప నదులకు వరద తాకిడి పెరిగింది. దీంతో ఆ నీరంతా గోదావరిలో కలుస్తుండటంతో వరద మొదలయ్యింది. ఉప నది శబరి పొంగిపొర్లుతూ గోదావరి నదిలో విలీనమవుతోంది. తూర్పు కనుమల్లోని వాగులు, వంకలు సైతం పొంగి పొర్లుతున్నాయి. దీనితో గత రెండు రోజులుగా పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి గురువారం మధ్యాహ్నం నుంచి నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద గురువారం రాత్రి 9 అడుగుల వరద నీటి మట్టం నమోదైంది.