ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలోనే రైల్వే జోన్ పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనబడిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ ఏర్పాటులో అంతులేని జాప్యం జరుగుతోంది. రాజధాని నిర్మాణం కృష్ణా, గుంటూరు జిల్లా మధ్య జరుగుతున్నందున విజయవాడ, గుంటూరు, గుంతకల్, వాల్టేర్ డివిజన్‌లతో విశాఖపట్టం కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయటానికి అక్కడి ఎంపి కంభంపాటి హరిబాబు ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపారు. అయితే రాష్ట్రంలోని పెద్ద రైల్వే కూడలి విజయవాడ కేంద్రంగా జోన్ ఏర్పాటు కావాలన్నది స్థానికుల చిరకాల వాంఛ. కానీ రాజధాని మనకే వచ్చింది కదాయని రాజీపడ్డారు. అయితే రెండున్నరేళ్లు గడుస్తున్నా అతిగతిలేదు. తాజాగా ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు పోలవరానికి రైల్వేజోన్‌కు ముడిపెట్టి తమాషాలు చేస్తున్నాయి. వాల్తేరు డివిజన్‌ను ఎప్పటిలాగే ఒడిశాలోని ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో కొనసాగించాలనే ఒత్తిడి కేంద్రంపై వస్తోంది. 1996లో అప్పటి ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని అప్పటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈస్ట్ వెనుకబడిన ఒడిశాలో ఈస్ట్‌కోస్ట్ జోన్‌ను ప్రకటించగా వాజ్‌పేయ్ హయాంలో 2003 నుంచి భువనేశ్వర్ కేంద్రంగా ఆ జోన్ పూర్తి స్థాయిలో పని చేయడం ఆరంభించింది. ఆ రెండు కేంద్ర ప్రభుత్వాల్లోనూ చక్రం తిప్పిన చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలోనే వాల్తేర్ డివిజన్ ఈస్ట్‌కోస్ట్ జోన్‌లోకి వెళ్లింది. ఆ జోన్‌లో వాల్తేరుతోపాటు ఖుర్దారోడ్, సంబల్‌పూర్ మూడు డివిజన్‌లు ఉండగా వీటిల్లో ఒక్క వాల్తేరు నుంచే అధిక ఆదాయం వస్తోంది. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు ఈస్ట్‌కోస్ట్ జోన్ పూర్తిగా ఉనికి కోల్పోడంతోపాటు భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది. ఈస్ట్‌కోస్ట్ డివిజన్‌లో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మల్కన్‌గిరి, బస్తర్ జిల్లాలున్నాయి. అక్కడ అధికారంలోను బిజెపి ప్రభుత్వం కూడా వాల్తేరును ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో కొనసాగించాలంటూ ఒత్తిడి తెస్తోంది. తాజాగా పోలవరానికి తాము సానుకూలంగా వ్యవహరించాలంటే వాల్తేరు డివిజన్‌ను యథావిథిగా ఉంచాలంటూ కేంద్రం వద్ద మతడ పేచీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయాలనే ఆందోళన క్రమేణా ఆరంభమవుతోంది. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్‌లతో ఈ కొత్త జోన్‌ను ఏర్పాటు చేయాలంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆంధ్ర విద్యార్థి యువజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు నేతృత్వంలో వందలాది యువకులు, విద్యార్థులు విజయవాడ జోన్ కోసం ధర్నా చేశారు. మాజీ శాసనసభ్యులు కె సుబ్బరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.