ఆంధ్రప్రదేశ్‌

అడ్డుకోవడం తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 15: సచివాలయంలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నాం.. త్వరలో ఇక్కడి నుంచే పాలన సాగిస్తాం..నెలాఖరులోగా ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుంది.. ఇక పారదర్శక పాలన అందించటమే తక్షణ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. గురువారం వెలగపూడిలో సచివాలయ భవన నిర్మాణ పనులను సిఎం పరిశీలించారు. ఒకటి, ఐదో బ్లాక్‌లో పనులపై ఆరాతీసి పలు సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్లే కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలనలో ఉంచింది. దీన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు బ్లాక్‌మెయిల్ చేయాలనే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈవిషయంలో తాను వెనక్కుతగ్గేది లేద’ని స్పష్టం చేశారు. హోదాకు తగిన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ముందుకొస్తే దాన్ని అడ్డుకోవటం ప్రజలను వంచించటమే అన్నారు. రిజర్వుబ్యాంక్ నివేదిక ప్రకారం 2015-16 సంవత్సరానికి 905 బిలియన్ కోట్ల పెట్టుబడులు వస్తే అందులో రాష్ట్రానికి 15.8 శాతం ఉన్నాయని వివరించారు. గుజరాత్‌కు 14.5, మహారాష్ట్ర 10.9, తమిళనాడు 9 శాతం వచ్చినట్లు తెలిపారు. ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో కేంద్రంతో తగవు పెట్టుకుంటే ఏదీ సాధ్యపడదని, ఒత్తిడి తెచ్చి అన్నీ సాధించుకుంటామని స్పష్టం చేశారు. సచివాలయంలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటుచేసి దసరా నాటికి పాలనా వ్యవస్థను కేంద్రీకరిస్తామన్నారు. రాష్ట్రం యూనిట్‌గా అన్ని జిల్లాలకు సాగు, తాగునీరందించేందుకు కృష్ణా, గోదావరి, పెన్నా,నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేయటమే లక్ష్యంగా చెప్పారు. భూ విస్తీర్ణాన్ని ఓ భూగర్భ జలాశయంగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని చెప్తూ అధునాతన యంత్ర పరికరాల సాయంతో 2018కల్లా పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. మొత్తం 6 కోట్ల 24 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు జరపాలని, అధునాతన యంత్రాలతో రోజుకు 30 నుంచి 40వేల క్యూబిక్ మీటర్ల మేర పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇకపై ప్రతి సోమవారం..పోలవారంలో మకాంవేసి పర్యవేక్షిస్తామన్నారు.