తెలంగాణ

సుందిళ్ల రాజన్నకు 10 లక్షల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ప్రముఖ కళాకారుడు, గేయ రచయిత సుందిళ్ల రాజన్న కుటుంబాన్ని అన్ని విధాల ఆందుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. రాజన్న ముఖ్యమంత్రి ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్‌తో కలిసి బుధవారం సిఎంను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. రాజన్న ఈ సందర్భంగా తన పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో ఉదారంగా స్పందించిన కెసిఆర్ తక్షణమే కుమార్తె వివాహానికి అవసరమైన రూ.10 లక్షల నగదును అందించారు. రాజన్న కుమారుడు అజయ్‌కు అవసరమైన మెరుగైన వైద్య సహాయం అందిస్తామని సిఎం హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే అంటూ పాటలెన్నో రాసిన రాజన్న ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సిఎం స్పందించి ఈ సహాయాన్ని అందజేశారు.
ఆర్ అండ్ బిలో
నలుగురు ఇఇల బదిలీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: తెలంగాణలో నలుగురు రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం ఆర్‌అండ్‌బి డివిజన్ ఇఇగా పని చేస్తున్న మహ్మద్ నజీర్ అహ్మద్‌ను మంచిర్యాల డివిజన్ ఇఇగా బదిలీ చేసింది. కొత్తగూడెం ఇఇగా పని చేస్తున్న పి.్ధనుంజయను ఖమ్మం డివిజన్ ఇఇగా బదిలీ చేసింది. సత్తుపల్లి ఆర్‌అండ్‌బి ఇఇగా పని చేస్తున్న ఎం.కృష్ణమూర్తిని కరీంనగర్ సర్కిల్ డిప్యూటీ ఎస్‌ఇగా, అక్కడున్న బి.రవీంద్రకుమార్‌ను సత్తుపల్లి డివిజన్ ఇఇగా బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నీటిపారుదల శాఖలో
14 మందికి పోస్టింగ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ద్వారా ఎంపికైన 14 మంది మెకానికల్ ఇంజినీర్లకు ఇరిగేషన్ శాఖలో ఎంపికైనట్లు ప్రభుత్వం నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి టిఎస్‌పిఎస్‌సి తొలి నియామకపు ఉత్తర్వులుగా పేర్కొంటూ వీరందరి ఎంపిక పత్రాలను అందజేయాలని ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ విజయప్రకాశ్‌కు కమిషన్ చైర్మన్ గంట చక్రపాణి అందజేశారు. ఇరిగేషన్ శాఖ మరోసారి అభ్యర్థుల వేలిముద్రలు పరిశీలించిన తర్వాత వారికి నియామకపు పత్రాలను అందజేస్తుందని తెలిపింది. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులందరిని మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాల్లోనే పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని ఇంజినీర్ ఇన్ చీఫ్ విజయప్రకాశ్ తెలిపారు.
నారాయణఖేడ్ టిఆర్‌ఎస్
అభ్యర్థి భూపాల్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు ఎం భూపాల్‌రెడ్డిని టిఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్ధిగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గత సాధారణ ఎన్నికల్లో నారాయణఖేడ్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఆగస్టు నెలలో అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కిష్టారెడ్డిపై పోటీ చేసి ఓటమి పొందిన టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డినే ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టాలని టిఆర్‌ఎస్ నిర్ణయించింది. ఇలాఉండగా దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలపాలని ఆ పార్టీ నిర్ణయించినప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. టిడిపి-బిజెపిలు తమ ఉమ్మడి అభ్యర్థిగా గత ఎన్నికల బరిలో తలపడిన ఎం విజయపాల్‌రెడ్డిని తిరిగి ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

సిట్టింగ్ జడ్జితో విచారణ చేయంచండి

రోహిత్ ఆత్మహత్యపై పది వామపక్షాల డిమాండ్ మోదీ పాలనలో భావ ప్రకటన స్వేచ్ఛ మృగ్యమయిందని ధ్వజం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: కేంద్రంలోని మోదీ నాయకత్వాన పని చేస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రజల భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని పది వామపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. మోదీ పాలనలో విద్య మొత్తం కాషారుూకరణ అయ్యిందని, మతవాద శక్తుల ఆగడాలు పెరిగిపోయాయని ఆ పార్టీల ప్రతినిధులు ధ్వజమెత్తారు. ఈ కారణాల వల్లే హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు ఆరోపించారు. సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం ఎపి కార్యదర్శి మధు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ నేత వై.సాంబశివరావు, సిపిఐ (ఎంఎల్) ప్రతినిధి గుర్రం విజయకుమార్, ఎంసిపిఐ (యు) నేత ఎం.వెంకటరెడ్డి, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నేత ఎన్.మూర్తి, సిపిఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ నేత చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎస్‌యుసిఐ (సి) అమర్‌నాథ్, ఫార్వర్డ్ బ్లాక్ పివి సుందర రామరాజు, ఆర్‌ఎస్‌పి నుంచి జానకి రాములు బుధవారం ఇక్కడ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థి ఆత్మహత్యపై వాస్తవాలను వెలికి తీసేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని, కానీ కంటితుడుపుగా ద్విసభ్య కమిటీని నియమించి హడావుడిగా నివేదిక ఇవ్వడం సరికాదని అన్నారు. ఇటీవల బిజెపి అనుబంధ విద్యార్థి సంఘమయిన ఎబివిపి, సంఘ్ పరివార్ శక్తులు విశ్వవిద్యాలయాల్లో మతఛాందస వాదాలను విస్తృతం చేస్తూ దళితులు, వెనుకబడిన వర్గాల విద్యార్థులపై కక్ష సాధిస్తూ భౌతికదాడులకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.
రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలే కారణమని, హెచ్‌సియు విసితో పాటు మంత్రులు స్వచ్ఛందంగా తమ పదవుల నుంచి వైదొలగాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని, మిగిలిన నలుగురు విద్యార్థులపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, వారికి చెల్లించాల్సిన స్టయిఫండ్‌ను వెంటనే చెల్లించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.