ఆంధ్రప్రదేశ్‌

ఇక ‘మీ ఇంటికి- మీ రేషన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో రేషన్ దుకాణానికి రాలేని వారికి జన్మభూమి కమిటీల ద్వారా ‘మీ ఇంటికి- మీ రేషన్’ కార్యక్రమంలో ఇళ్లవద్దకే నిత్యావసరాలను తెచ్చి అందించనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. బుధవారం సచివాలయం మూడవ బ్లాక్ ఫస్ట్ఫో్లర్‌లో మంత్రి పేషీని, పౌరసరఫరాల కార్యాలయాన్ని స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాతతో కలసి ఆమె ప్రారంభించారు. అనంతరం మీడియాతో మంత్రి పరిటాల మాట్లాడుతూ ఈ పోస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోటీ 15 లక్షల మందికి నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులు ఏ ప్రాంతంలో ఉన్నా రేషన్ పొందే వీలు కల్పించామన్నారు. రేషన్ డీలర్లకు కమిషన్ చార్జీలు పెంచడం ద్వారా పారదర్శకంగా నిత్యావసరాలను పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. ప్రతి జిల్లాలో డ్వాక్రా సంఘాలకు రెండు పెట్రోల్ బంకులను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 13 జిల్లాల్లో 23 చోట్ల స్థల పరిశీలన పూర్తయిందని వివరించారు. దీనివల్ల కొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ నిర్వహణకు ఆరు గ్యాస్ ఏజెన్సీలను మంజూరు చేసిందని వివరించారు. రేషన్‌కార్డులు.. వంటగ్యాస్ కనెక్షన్లను అర్హులైన వారందరికీ అందించేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. దీపం పథకం ద్వారా ఇప్పటి వరకు 13 లక్షల కనెక్షన్లు మంజూరు చేశామని వచ్చే రెండేళ్లలో 30లక్షల కనెక్షన్లు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కొత్తగా 11లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరయ్యాయని, మరో 4.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.