ఆంధ్రప్రదేశ్‌

ఇక అన్నీ తెలుగులోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: అధికారికంగా తెలుగు భాష అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. రానున్న రోజుల్లో శిలాఫలకాలు, శంకుస్థాపన- ప్రారంభోత్సవ నామ ఫలకాలు తప్పనిసరిగా తెలుగులో ఉండేలా ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం 11వ ఉత్తర్వులను జారీ చేసింది. గత నెల 29వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా సంస్కృతి అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ నామ ఫలకాలు తప్పనిసరిగా తెలుగులో ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలను తీసుకుంది. పట్టణా లు, నగరాల్లో దుకాణాలు, సముదాయాలు పేర్లు అన్నీ తప్పనిసరి తెలుగులో రాయించడానికి తగిన చర్యలను తీసుకోవడానికి లేబర్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
అధ్యయన కమిటీ ఏర్పాటు
భాషా సంస్కృతి, అభివృద్ధికి రాష్ట్రప్రభు త్వం అధ్యయన కమిటీని నియమించింది. ఈ కమిటీ నెల రోజుల్లో తమ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం నాడు జీవో 10ని జారీ చేసింది. భాషా, సాంస్కృతిక అభివృద్ధి అధ్యయన కమిటీకి చైర్మన్‌గా పల్లె రఘునాధరెడ్డి వ్యవహరిస్తారు. సభ్యులుగా ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, డాక్టర్ పరకాల ప్రభాకర్, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్, పురావస్తుశాఖ సంచాలకుడు డాక్టర్ జివి రామకృష్ణారావు ఉంటారు. కమిటీకి సభ్య కార్యదర్శిగా భాషాసాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ డి విజయభాస్కర్ వ్యవహరిస్తారు.
ప్రస్తుతం ఉన్న అధికార భాషాచట్టం స్థానంలో తెలుగు భాషాభివృద్ధికి అధికార భాషగా అమలుకు తెలుగు భాషాప్రాధికార సంస్థ చట్టాన్ని తీసుకురావడంపై ఈ కమిటీ సూచనలు, సలహాలు ఇస్తుంది. పురావస్తు శాఖ , ప్రాచీన భాండాగారానికి సంబంధించి సంస్థాగత ఏర్పాటు చేస్తారు, సంస్కాృతిక శాఖకు సంబంధించి సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న వివిధ సంస్థల పునర్వ్యవస్థీకరణపై కూడా ఈ కమిటీ పలు సూచనలు చేస్తుంది. విభజన చట్టానికి సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి వంటి సంస్థల విభజన, విద్యారంగంలో తెలుగు బోధించడానికి కార్యాచరణ ప్రణాళిక, పాలనారంగంలో పూర్తి స్థాయిలో తెలుగు వాడకాన్ని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక, సమాచార సాంకేతిక రంగంలో తెలుగు వినియోగంలో సిఫార్సులను ఈ కమిటీ చేస్తుంది. ప్రాచీనభాషా కేంద్రం ఏర్పాటుపై కూడా పలు సిఫార్సులను చేస్తుంది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో తెలుగు వారి భాషా సంస్కృతి పరమైన సమస్యలపై సూచనలు చేస్తారు. తెలుగు, సంస్కృతిని అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది.