ఆంధ్రప్రదేశ్‌

దేవాదాయ శాఖ నిర్వీర్యం? రెవెన్యూశాఖలో విలీనానికి యత్నాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), సెప్టెంబర్ 13: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి 50 కిమీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాలు, మఠాలు తదితర వాటిని దుర్గగుడి ఆధీనంలోకి తీసుకువచ్చే విధంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో తయారు చేస్తున్నట్టు తెలిసింది. స్వాధీనం చేసుకునే ఆలయాల్లో సిబ్బందిని వారి కేడర్‌ను బట్టి దుర్గ గుడిలో వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖను నిర్వీర్యం చేస్తూ రెవెన్యూ శాఖను బలోపేతం చేసే విధంగా ఈ నూతన జీవో రూపొందుతున్నట్టు బోగట్టా. మల్టీ జోన్ రీజనల్ జాయింట్ కమిషనర్, డెప్యూటీ కమిషనర్, వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసిస్టెంట్ కమిషనర్లు ఈ వ్యవస్థను తొలగించి రెవెన్యూ పరిధిలోకి తీసుకురానున్నారు.
ఇదేవిధంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం తదితర ప్రముఖ దేవస్థానాలకు ఇవోలుగా ఐఎఎస్ అధికారులను నియమించి, వాటికి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆలయాలను ఐఎఎస్ అధికారుల పరిధిలోకి తీసుకు వస్తారు. ఈ నూతన జీవో రెండు, మూడు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొద్ది రోజుల కిందట దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెవిఎస్ ప్రసాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్‌జెసిలు, డిసిలు, ఎసిలు, ఫస్ట్ గ్రేడ్ ఇవోలు తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించి సూచనప్రాయంగా ఈ విషయం తెలిపారు.
మున్ముందు దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఐఎఎస్ అధికారుల కింద పనిచేయవలసిందే. ఈ శాఖ స్వయంప్రతిపత్తి కోల్పోయి, పూర్తి స్థాయిలో రెవెన్యూ శాఖలో విలీనం కానుంది. గతంలో రెవెన్యూ శాఖలో దేవాదాయ శాఖ అంతర్భాగంగా ఉండేది.