తెలంగాణ

మార్చినాటికి వంద గోదాములు నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: నాబార్డు ఆర్థిక సహాయంతో తెలంగాణ రాష్ట్రంలో రూ. 1024 కోట్ల వ్యయంతో చేపట్టిన 330 గోదాంల నిర్మాణాలను జూన్ నెలాఖరుకు నాటికి పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వచ్చే మార్చి నాటికి 100 గోదాంలు, జూన్ నాటికి మరో 230 గోదాంల నిర్మాణం పూర్తి కావాలని మంత్రి సూచించారు. సచివాలయంలో బుధవారం మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శరత్, అదనపు డైరెక్టర్ లక్ష్మిబాయి, ఉద్యాన వనశాఖ డైరెక్టర్ వెంకట్‌రామిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ఎస్‌సి నాగేశ్వర్‌రెడ్డితో పాటు జిల్లాల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి దశలో 128 గోదాంలను రూ.411 కోట్ల వ్యయంతో 6.85 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో చేపట్టినట్టు మంత్రి తెలిపారు. అలాగే రెండవ దశలో 202 గోదాంలను రూ. 613 కోట్ల వ్యయంతో చేపట్టగా వీటి సామర్థ్యం 10.22 లక్షల మెట్రిక్ టన్నులని మంత్రి వివరించారు. గోదాంల నిర్మాణంలో అన్ని జిల్లాల కంటే నల్లగొండ జిల్లా ముందుండగా, మహబూబ్‌నగర్ జిల్లా వెనుకంజలో ఉందని మంత్రి అన్నారు. రెండు వారాల్లో పనులను వేగవంతం చేయకపోతే మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించిన గోదాంలను ఇతర జిల్లాలకు బదిలీ చేయనున్నట్టు మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లా అధికారుల అలసత్వం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో చేపట్టిన 100 గోదాంల నిర్మాణాలు మార్చి నాటికి, రెండవ దశలో చేపట్టిన 230 గోదాంల నిర్మాణాలను జూన్ నెలాఖరుకు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పనులలో ఎక్కడా రాజీపడకూడదని, నాణ్యత పరిశీలనకు మూడో పక్షంతో తనిఖీలు జరిపించనున్నట్టు మంత్రి హెచ్చరించారు. గోదాంల నిర్మాణాల కోసం ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు 8 శాతం నుంచి 15 శాతం వరకు తక్కువ కోట్ చేయడం వల్ల ప్రభుత్వానికి రూ. 120 కోట్లు ఆదా అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. గోదాంల పైకప్పులపై సౌర విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని, ఈ అంశంపై కేంద్ర సౌర విద్యుత్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో చర్చించాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, మెదక్ జిల్లా వంటిమామిడిలో కోల్డ్ స్టోరేజిల నిర్మాణ పనులను టాప్ బ్లూ సప్లయి చైన్ కంపెనీకి అప్పగించింది. ఈ పనుల పురోగతిని కూడా మంత్రి తెలుసుకున్నారు. వీటితో పాటు మరో రెండు కోల్డ్ స్టోరేజిలు నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. రాబోయే 10 సంవత్సరాల అవసరాలకు సరిపడే విధంగా కోల్డ్ స్టోరేజిలను నిర్మించాలని మంత్రి సూచించారు. ఉల్లిగడ్డ ధర హెచ్చు తగ్గులతో పని లేకుండా ఎల్లవేళలా ఉల్లిగడ్డను కొనుగోలు చేయడానికి అనుగుణంగా చట్టాన్ని తీసుకురానున్నట్టు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

పాపం మూగజీవాలు

రెండు రోజులు కంటైనర్‌లోనే..
తిండి, నీరు, గాలి లేక అల్లాడిన వైనం
శంషాబాద్ వద్ద పట్టుకున్న పోలీసులు

శంషాబాద్, జనవరి 20: లారీ కంటైనర్‌లో కుక్కి తరలిస్తున్న గోవులను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ లారీలో 80 నుండి 100 గోవులను నగరానికి చెందిన ఓ వ్యాపారి శ్రీకాకుళం నుంచి బుధవారం అక్రమంగా తరలిస్తున్నాడు. అనుమానం వచ్చిన ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని ఆర్‌జిఇఏ పోలీసులకు అప్పజెప్పారు. రెండు రోజులుగా మేత, నీరు లేక ఆ గోవులు కంటైనర్‌లోనే మగ్గిపోయ ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో పట్టుబడ్డాయ. అయతే ఆ గోవులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటికి నీరు గాని, మేత గాని అందించకపోవడంతో అవి గాలి ఆడక దారుణమైన స్థితికి చేరుకున్నాయ. శ్రీకాకుళం నుంచి ఈ గోవులు శంషాబాద్‌కు రావడానికి కనీసం రెండు రోజులు పడుతుందన్న విషయం అందరికి తెలిసిందే. ఈ గోవులకు దాదాపు మూడు రోజులుగా తిండి, నీరు, గాలి లేక ప్రయాణం చేసినట్లు వాటి పరిస్థితి చూస్తే తెలుస్తోంది. మూగజీవుల పట్ల జాలి చూపకుండా వ్యాపార దృక్పథంతో వాటిని కుక్కి రెండు మూడు రోజులుగా తిండి పెట్టకుండా తీసుకురావడం అమానుషమైతే వాటిని పట్టుకున్న అధికారులు సైతం వాటి గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా వాటిని కంటైనర్‌లో అలాగే ఉంచి ఆహారం పెట్టకపోవడాన్ని ఏమనాలని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో
తెలంగాణ ఫారెస్టు కాలేజి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: మెదక్ జిల్లాలో ఇటీవల ప్రారంభించిన ఫారెస్టు కాలేజిని అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పడమే కాకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కోయంబత్తూరు ఫారెస్టు కాలేజిలో చదువుకున్న 156 మంది విద్యార్థులు ఐఎఫ్‌ఎస్ అధికారులు అయ్యారని, అదే మాదిరిగా తెలంగాణ ఫారెస్టు కాలేజిలో చదువుకునే విద్యార్థులు కూడా ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హరితహారం, ఫారెస్టు కాలేజిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అమెరికాలోరి అబర్న్ ఫారెస్టు కాలేజి అత్యున్నత ప్రమాణాలతో నడస్తుందని, ఆ కాలేజితో తెలంగాణలో ఏర్పాటు చేసిన ఫారెస్టు కాలేజితో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఐఏఎస్ రత్నప్రభకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్, జనవరి 20: కర్నాటక కేడర్ ఐఏఎస్ అధికారి రత్న ప్రభపై వచ్చిన అభియోగాలపై ఏసిబి కోర్టులో ఉన్న ఒక కేసు విచారణపై హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఈ కేసు రహేజా మైండ్‌స్పేస్ ఏపిఐఐసి జాయింట్ వెంచర్ ప్రాజెక్టుకు సంబంధించినది. ఈ కేసులో వచ్చే నెల 9వ తేదీన హాజరు కావాలని ఏసిబి ప్రత్యేక కోర్టు ఇచ్చిన సమన్లను సవాలు చేస్తూ ఐఎఎస్ అధికారి రత్న ప్రభ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలాంగో స్టే మంజూరు చేసి కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేశారు.
ఐసిఎస్‌ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్‌గా మహదేవ్
హైదరాబాద్, జనవరి 20: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ చైర్మన్‌గా మహదేవ్ తిరునగరి ఎన్నికైన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. 2016 సంవత్సరానికి సంబంధించిన కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు బుధవారం తెలిపింది. కొత్త కార్యవర్గంలో వైస్ చైర్మన్‌గా ఆర్.వెంకటరమణ, కార్యదర్శిగా ఎం.వి.రవికుమార్, ట్రెజరర్‌గా రాహుల్‌జైన్ ఎన్నికైనట్లు తెలిపింది. ఈ కొత్త కార్యవర్గం ఏడాదిపాటు కొనసాగుతుందని తెలిపింది. మహదేవ్ తిరునగరి 2015 కార్యవర్గంలో వైస్‌చైర్మన్‌గా పని చేశారు. తిరునగరి ఇన్‌వెస్టర్ అవేర్‌నెస్ కమిటీ, సిఎస్‌బిఎఫ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
గనులు, ఖనిజ చట్టం అమలుకు కమిటీలు
హైదరాబాద్, జనవరి 20: జిల్లా స్థాయిలో గనులు, ఖనిజ చట్టం అమలుకు కమిటీలను నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ఏరియా, ట్రైబల్ ఏరియాలలో గనుల చట్టం సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ ఆధారిత వర్గాల రక్షణ చట్టం అమలు కోసం రెండు కమిటీలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గవర్నింగ్ కౌన్సిల్, మేనేజింగ్ కమిటీలను నియమించింది. గవర్నింగ్ కౌన్సిల్‌లో ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్‌పర్సన్, ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా జిల్లా మంత్రి, సభ్యులుగా ఆయా గ్రామసభకు చెందిన ఒక మహిళ, సంబంధిత మైనింగ్ కంపెనీ ప్రతినిధి, ప్రభుత్వం నియమించిన జిల్లా స్థాయి ఉన్నతాధికారులను నియమించినట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది.

మేనేజింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా జిల్లా కలెక్టర్, కోచైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, సభ్యులుగా ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్, ఆయా ప్రాంతాల ఐదుగురు మహిళా ప్రతినిధులు, డిఆర్‌డిఏ పిడి, జిల్లా మైనింగ్ శాఖ ఎడి, మైనింగ్ కంపెనీ నుంచి ఒక ప్రతినిధి, లీడ్ బ్యాంక్ ఆఫీసర్‌ను సభ్యులుగా నియమిస్తూ జిల్లాకు చెందిన క్లాస్ -1 స్థాయి అధికారి ఒకరిని సభ్య కన్వీనర్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

సెంట్రల్ వర్శిటీ వివాదంపై
హైకోర్టుకు అఫిడవిట్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ వివాదంలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందిన విద్యార్ధులు మరో రీసెర్చి విద్యార్ధి సుశీల్‌కుమార్‌పై దాడి చేస్తే గాయాలుతగిలినట్లుగా వచ్చిన అభియోగాలపై వర్శిటీ అధికారులు, సైబరాబాద్ పోలీసులు బుధవారం హైకోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేశారు. వర్శిటీ రిజిస్ట్రార్ బి పాండురెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఈ అఫిడవిట్లను దాఖలు చేశారు. తమకు విద్యార్ధి సుశీల్‌కుమార్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిన వెంటనే ఒక అసిస్టెంట్ పోలీసు సబినస్పెక్టర్ వెంటనే వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేసి కేసును రిజిస్టర్ చేశారని సైబరాబాద్ పోలీసులు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వైద్యాధికారి ఇచ్చిన నివేదికలో సుశీల్‌కుమార్‌కు తగిలిన గాయాలు సాధారణమైనవని, అపెండిస్‌సైటిస్‌తో బాధపడుతున్నారని, వెంటనే శస్తచ్రికిత్స చేశామని తెలిపారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వర్శిటీ రిజిస్ట్రార్ తన అఫిడవిట్‌లో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఏబివిపి విద్యార్ధుల మధ్య తోపులాట, ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. యాకూబ్ మెమోన్ ఉరికి వ్యతిరేకంగా అంబేద్కర్ విద్యార్ధి సంఘం ర్యాలీ చేసిన ఉదంతంపై ఫేజ్‌బుక్‌లో అభ్యంతరాన్ని సుశీల్‌కుమార్ నమోదుచేశారన్నారు. దీని వల్లనే రెండు సంఘాల విద్యార్ధుల మధ్య తోపులాట జరిగిందన్నారు. సమాచారం తెలిసిన వెంటనే విద్యార్ధి సంక్షేమ విభాగం డీన్ హుటావుటిన వెళ్లి రెండు గ్రూపులను సముదాయించారని, అనంతరం గేట్ వరకు సుశీల్‌కుమార్‌ను భద్రతా సిబ్బంది తీసుకెళ్లారన్నారు. ఆ తర్వాత సుశీల్‌కుమార్ చందానగర్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. ఈ సంఘటన విచారణ బాధ్యతను ప్రోటోకాల్ బోర్డుకు నివేదించామన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం సుశీల్‌కుమార్‌ను మరో విద్యార్ధి సంఘం విద్యార్ధులు కొట్టినట్లు తగిన ఆధారాలు లేవన్నారు. కమిటీ ముందుకు హాజరు కాలేదని, తన వాంగ్మూలాన్ని, వైద్య నివేదికను సుశీల్‌కుమార్ ఇవ్వలేదన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ విద్యార్ధి అసోసియేషన్ విద్యార్ధులు డి ప్రశాంత్, వింసెంట్, రోహిత్ వేముల, పి విజయ్‌కుమార్, సుంకన్న, శేషుతో పాటు ఏబివిపి నేత సుశీల్‌కుమార్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ కమిటీ నివేదికను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు సెప్టెంబర్ 7వ తేదీన ఉంచామని, ఈ కమిటీ సిఫార్సు మేరకు రోహిత్ తదితరులను సస్పెండ్ చేయాలని నిర్ణయించిందసన్నారు. కాగా ఈ సస్పెండ్‌ను సెప్టెంబర్ 10వ తేదీన ఎత్తివేశామని, సస్పెన్షన్‌ను కొనసాగించడం వల్ల విద్యార్ధులకు ఉపకారవేతనం లభించదని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.