తెలంగాణ

మీ ఓటెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 150 డివిజన్లు..7757 పోలింగ్ కేంద్రాలు..74 లక్షల పై చిలుకు ఓటర్లు. వీటిలో మన ఓటు ఎక్కడుందో, ఇపుడు వెతుక్కుని ఓటు వేయాలా? అన్న బెంగ అవసరం లేదు. ఎవరి ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో, పోలింగ్ బూత్ నెంబరు, ప్రాంతంతో పాటు పూర్తి ఓటరు వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకునేందుకు వీలుగా మహానగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక యాప్‌కు రూపకల్పన చేశారు. 2009 జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కేవలం 43శాతం ఓట్లు మ ఆత్రమే పోలింగ్ కావటంతో ఈ సారైనా వీలైనంత ఎక్కువ పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిహెచ్‌ఎంసి అధికారులు సమష్టిగా చేసిన కృషి కారణంగా ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. గ్రేటర్‌లోని ప్రతి ఓటరు తాము వినియోగించే స్మార్ట్ఫోన్, ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌లోనూ తమ ఓటు వివరాలను చూసుకునేందుకు వీలుగా దీన్ని రూపకల్పన చేసినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.
ఓటు తాలుకూ వివరాలను కేవలం చూసుకోవటమే గాక, ఆన్‌లైన్‌లో ఓటరు స్లిప్‌ను కూడా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో రాజకీయపార్టీలు ఇంటింటికి తిరిగి ఓటరు స్లిప్‌లను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నానికి సైతం ఈ యాప్‌తో కొంత వరకు బ్రేక్ పడవచ్చునని భావించవచ్చు.
ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఓటు, పోలింగ్ కేంద్రం వివరాలను చూసుకోవటంతో పాటు ఓటరు స్లిప్‌ను డౌన్ చేసుకునేందుకు వీలుగా రూపకల్పన చేసిన యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని కూడా అధికారులు వివరించారు.
* తొలుత గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి లాగిన్ కావాలి. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* తెలంగాణ ఎన్నికల సంఘాన్ని సెలక్ట్ చేసుకున్న తర్వాత స్పేస్ ఇచ్చి ‘ఓటరు స్లిప్’ను క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి
* ఆ తర్వాత మీ వద్దనున్న ఎన్నికల గుర్తింపు కార్డుపైనున్న ఓటరు ఐడి నెంబర్‌ను టైప్ చేసి, గెట్ డేటాని ఎంటర్ చేస్తే, ఓటరు స్లిప్ సిస్టమ్‌లో గానీ, ఫోన్‌లో గానీ డిస్‌ప్లే అవుతోంది.