తెలంగాణ

టిక్కెట్లు అమ్ముకుంటున్న ఆ మూడు పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో తెరాస, తెదేపా, బిజెపిల కార్పొరేషన్ సీట్ల అమ్మకం జోరుగా సాగుతోందని లోక్‌సత్తా గ్రేటర్ విభాగం ఆరోపించింది. బుధవారం లోక్‌సత్తా గ్రేటర్ విభాగం ప్రధాన కార్యదర్శి సాంబిరెడ్డి, సహకార్యదర్శి లావణ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెరాస ఒక్కో సీటును రూ. కోటికి, తెదేపా, బిజెపిలు రూ. 50 లక్షలకు అమ్ముతున్నాయని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ అవినీతిని అరికట్టేందుకు సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. సాధ్యం కాని హామీలతో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జిహెచ్‌ఎంసి బడ్జెట్ సంవత్సరానికి 5600 కోట్లు అయితే అక్రమ సంపాదన ద్వారా ఇంతకు మూడింతలు సంపాదించాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.

హైదరాబాద్ క్యాట్ హెడ్‌గా
జస్టిస్ శేషశయన రెడ్డి

హైదరాబాద్, జనవరి 13: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శేషశయనరెడ్డి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) హైదరాబాద్ బెంచ్ హెడ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన చెన్నై క్యాట్ నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. 1990లో జ్యుడీషియల్ అధికారిగా ఆయన కేరీర్ ప్రారంభించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. హైకోర్టు న్యాయమూర్తిగా 2002లో నియమితులయ్యారు. 2013లో పదవీ విరమణ చేశారు.

విసి పదవులకు
1289 దరఖాస్తులు

హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ పదవులకు 330 మంది దరఖాస్తు చేశారు. శుక్రవారం వరకూ దరఖాస్తుల స్వీకరణ గడువు ఉన్నా, పోస్టులో వచ్చిన దరఖాస్తులను సోమవారం వరకూ అధికారులు స్వీకరించినట్టు తెలిసింది. ఒకొక్కరు 5 నుండి 8 దరఖాస్తులు చేయడంతో వాటి సంఖ్య 1289కు పెరిగింది. మొత్తం దరఖాస్తులపై బుధవారం నాటికి అధికారులకు ఒక స్పష్టత వచ్చినట్టు తెలిసింది.
అత్యధికంగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి 182 దరఖాస్తులు వచ్చాయి, అదే సంఖ్యలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీకి 182 దరఖాస్తులు వచ్చాయి. పాలమూరు విశ్వవిద్యాలయానికి 176 దరఖాస్తులు, శాతవాహన విశ్వవిద్యాలయానికి 165, తెలంగాణ విశ్వవిద్యాలయానికి 162 దరఖాస్తులు వచ్చాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 145, కాకతీయ విశ్వవిద్యాలయానికి 128, జెఎన్‌టియు హైదరాబాద్‌కు 84, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి 48 దరఖాస్తులు వచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం నుండి ఒక్కో దరఖాస్తు పరిశీలన మొదలైంది. వారం పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసినా, నియామకాలు మాత్రం జిహెచ్ ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాతనే ఉంటుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.