తెలంగాణ

తేడా చూపిస్తే బ్లాక్ లిస్టులోకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: నిర్మాణ రంగం ప్రోత్సాహకంగా చాలావరకూ నిబంధనలు సరళీకృతం చేశామని, బిల్డర్లు సద్వినియోగం చేసుకోవాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. వెసులుబాటును దుర్వినియోగపర్చి అక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అవసరమైతే బ్లాక్‌లిస్టులో పెట్టేందుకూ వెనుకాడేదిలేదన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం 27వ అఖిల భారత బిల్డర్ల అసోసియేషన్ సదస్సును కెసిఆర్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. మూడు రోజుల సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 1200 మంది ప్రతినిధులతోపాటు, టర్కీకి చెందిన నిర్మాణరంగ నిపుణులు హాజరయ్యారు. భవిష్యత్‌లో నిర్మాణ రంగానికి హైదరాబాద్ హబ్ కాబోతోందని సిఎం ప్రకటించారు. దేశంలో వ్యవసాయం తర్వాత నిర్మాణరంగమే అత్యధికంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. కాంట్రాక్టర్లను కేంద్రం వర్కింగ్ ఏజెన్సీలుగా గుర్తించాలని సిఎం సూచించారు. రియల్టీ రంగం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రి వెంకయ్య చొరవ చూపాలన్నారు. మోదీని ప్రగతిశీల ప్రధానిగా అభివర్ణిస్తూ, నిర్మాణరంగ ప్రోత్సాహానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టం క్లిష్టంగా ఉందని, దానిలో ప్రస్తుత ప్రభుత్వం మార్పుల చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తెలంగాణ ఎన్నో చర్యలు చేపట్టిందంటూ, ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వాలు భూసేకరణ జరిపితే, తాము భూములు కొనుగోలుచేసి భూమిని సేకరించే విధానానికి శ్రీకారం చుట్టామని సిఎం గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మేకిన్ ఇండియాలో నిర్మాణ రంగం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మేకిన్ ఇండియా, స్వచ్ఛ భారత్ స్వప్నం సాకారమయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చారు.

చిత్రం... అఖిల భారత బిల్డర్ల అసోసియేషన్ సదస్సులో
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రి వెంకయ్య