తెలంగాణ

స్నానపు ఘాట్లన్నీ ‘జనమయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: కృష్ణా ఆదిపుష్కరాలకు మంగళవారం చివరి రోజు కావడంతో తెలంగాణకు చెందిన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కరఘాట్లకు భక్తుల రద్దీ ఉధృతమయింది. ఆదిపుష్కరాలు ప్రారంభమై పదకొండు రోజులు గడిచాయి. పదకొండవరోజైన సోమవారం రెండు జిల్లాల్లోని 90 ఘాట్లు జనమయం అయ్యాయి. ఆదిపుష్కరాలు ప్రారంభమైనప్పటి నుండి భక్తుల రాక భారీగానే ఉన్నప్పటికీ, చివరి రెండురోజుల్లో ఈ సంఖ్య అధికారుల ఊహలకు అతీతంగా పెరిగింది. ఆదిపుష్కరాలకు చివరిరోజైన మంగళవారం రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు అంచనావేస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ప్రభుత్వ పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు పుష్కరస్నానాలు విజయవంతంగా కొనసాగాయి. ఒకటి రెండు స్వల్ప సంఘటనలు మినహా చెప్పుకోదగ్గ దురదృష్ట సంఘటనలు జరగలేదు. ప్రభుత్వం రూపొందించిన పటిష్టమైన ప్రణాళిక కారణంగానే ఆదిపుష్కరాలు సజావుగా సాగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు రెండుకోట్లమందికి పైగా పుణ్యస్నానాలు చేశారు. రెండు జిల్లాల నుండి అందిన సమాచారం మేరకు సోమవారం ఒకరోజే రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణాబిడ్జి, బీచుపల్లి, జూరాల, ఆలంపూర్ జోగులాంబ, సోమశిల, రంగాపూర్, జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, నల్లగొండ జిల్లాలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్, కాచరాజుపల్లి, పెద్దమునిగల్, అజ్మాపూర్, ఉట్లపల్లి,పొట్టిచెల్ల తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్నానపుఘాట్లన్నీ జనంతో నిండిపోయాయి. ఇలా ఉండగా విఐపిల ఘాట్లకు కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. రాజకీయ నేతలు, సివిల్‌సర్వీసెస్ అధికారులు, ఉన్నతాధికారులు, సినీరంగప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రభుత్వం నియమించిన యంత్రాంగం తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధిగా ఉంటూ పనిచేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయితీరాజ్ తదితర శాఖల ఉద్యోగులంతా నిరంతరం పనిచేస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్యం కోసం నియమించిన వారు ప్రతిక్షణం తమ విధినిర్వహణ చేస్తుండటంతో ఏ ప్రాంతంలో కూడా పారిశుద్ధ్యంపై విమర్శలు రాలేదు. జిల్లాకలెక్టర్లు, జిల్లాల ఎస్‌పిలు కిందిస్థాయి సిబ్బందికి సోమవారం ఆదేశాలు జారీ చేస్తూ, మంగళవారం మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు డ్యూటీలో కొనసాగాలని ఆదేశించారు.

చిత్రం..బీచుపల్లి పుణ్యక్షేత్రంలో భక్తుల జనసందోహం