తెలంగాణ

బ్రిక్స్ సదస్సులో తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: జైపూర్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం టిఆర్‌ఎస్ ఎంపి కవిత వివరించారు. సదస్సు రెండవ రోజు కార్యక్రమాల్లో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంలో వస్తున్న మార్పులు, సభ్య దేశాలు తీసుకోవలసిన చర్యల గురించి జరిగిన చర్చలో ఎంపి కవిత మాట్లాడారు. తెలంగాణకు హరిత హారం ద్వారా పర్యావరణం కోసం ఏ విధంగా కృషి చేస్తున్నది వివరించారు. ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటే మహా యజ్ఞం కొనసాగుతుందని చెప్పారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం 1300 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. మొత్తం మానవ ఇతిహాసంలోనే మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నంగా హరిత హారం చరిత్ర సృష్టించబోతున్నదని బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో 22శాతంగా ఉన్న చెట్లను 33శాతానికి పెంచేందుకు తీవ్రంగా కృషి జరుగుతోందని చెప్పారు. అదే విధంగా భారత రైతులు ప్రధానంగా చెరువులను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నందున ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అదే క్రమంలో నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయను సభ్య దేశాల ప్రతినిధులకు వివరించారు. మిషన్ కాకతీయలో భాగంగా తొలి రెండేళ్లలో ఆరువేల కోట్ల రూపాయల ఖర్చుతో 17,400 చెరువుల్లో పూడికలు తీసి, చెరువు కట్టల మరమ్మత్తులు చేశామని చెప్పారు. మొత్తం ఐదేళ్లలో 46వేల చెరువులను పునరుద్ధరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రైతాంగాన్ని ఆదుకోవడంతో పాటు భూగర్భ జలాలలను పెంచడానికి కూడా తమ ప్రభుత్వం మిషన్ కాకతీయలో చర్యలు చేపట్టినట్టు కవిత తెలిపారు. పర్యావరణ, సహజ వనరుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివిధ దేశాల ప్రతినిధులు అభినందించారు.

బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో ఎంపి కవిత