తెలంగాణ

కొత్త జిల్లాలపై నేడే నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21:కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వం కోరుకున్న విధంగా సాగుతోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసే 27 జిల్లాలతోపాటు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల గురించి పూర్తి వివరాలు పొందు పరుస్తారు. జిల్లా కలెక్టర్లకు ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజన చట్టం 1974లో ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని మాత్రమే ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అవేమీ ప్రాతిపదిక కానక్కర్లేదు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేయవచ్చు. లేదంటే ముసాయిదానే యథాతథంగా ఆమోదించవచ్చు. గద్వాల, జనగామల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ప్రాంతాలను కొత్త జిల్లాలను చేయాల్సిందే అని ఆయాజిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినా, ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకోవాలని ఏమీ లేదని నిపుణులు అంటున్నారు. న్యాయపరంగా అడ్డంకులు ఏమీ రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. 1974 యాక్ట్‌లో ఉన్న నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తోంది. జిల్లాలతో పాటు జిల్లా పరిషత్తులను ఒకేసారి విభజిస్తే న్యాయపరంగా చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు.