తెలంగాణ

మైనార్టీ కాలేజీల్లో నీట్ ద్వారానే అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: ఫీజుల పెంపు, సవరింపు, కౌనె్సలింగ్, సీట్ల భర్తీ వంటి పలు అంశాలపై ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి శనివారం నాడు చర్చలు జరిపారు. సచివాలయంలోని తన చాంబర్‌లో రాష్ట్రంలోని పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎపిలో ఉన్నట్టు ఫీజులను పెంచాలని కోరారు. అలాగే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీపై చర్చ జరిగింది. విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వివాదాస్పద అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. సీట్ల భర్తీకి అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల ప్రతినిధులతో కన్సార్టియం ఏర్పాటు చేస్తామని, పాత పద్ధతిలోనే సీట్ల భర్తీ జరుగుతుందని అన్నారు. నీట్ ర్యాంకు ద్వారానే మేనేజిమెంట్ , ఎన్‌ఆర్‌ఐ కోటా అడ్మిషన్లు జరగాల్సి ఉందని అయితే అడ్మిషన్లకు సంబంధించిన ఫీజుల విషయంలో మరింత చర్చించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.