తెలంగాణ

జాతిని కాపాడేది ఆధ్యాత్మికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: భరత జాతిని కాపాడేది ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం మాత్రమేనని బిజెపి ఉపాధ్యక్షుడు, ఎంపి వినయ్ సహస్రబుద్ధి అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన జనమంచి గౌరీశంకర్ 14వ స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వినయ్ సహస్రబుద్ధి మాట్లాడుతూ జనమంచి త్యాగం, నిబద్ధత అంటే ఏమిటో ఆచరించి చూపించారని, అవిభక్త ఆంధ్రలో గౌరీజీ నక్సలైట్లతో చేసిన సంఘర్షణ చెప్పుకోదగిందని అన్నారు. భారత్ ముక్కలు అయిందని అంటున్నారని, అలా ఎన్నటికీ జరగదని, ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో పత్రికల్లో ఒక ప్రకటన వచ్చేదని, అందులో ఒక హిందూ, ముస్లిం, క్రైస్తవులతో కూడిన చిత్రం ఉండేదని అన్నారు.
జస్టిస్ గోవింద్ రనాడే ఎపుడూ మాట్లాడుతూ తాను ముస్లిం లేదా హిందూ కాదు, తాను హిందీ అనేవారని గుర్తుచేశారు. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం మాత్రమే మన జాతీయతను కాపాడుతుందని పేర్కొన్నారు. చార్‌ధామ్ యాత్ర చేయాలని ఎక్కడా ఎలాంటి జీవో లేదని, కానీ మనమంతా చేస్తున్నామని, అది మన సాంస్కృతిక జాతీయవాదమని పేర్కొన్నారు. తాను ఈ మధ్య నాగాలాండ్ వెళ్లానని, అక్కడ ఒక స్ర్తి బయటకు వెళ్లిన తన భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో దర్వాజాలో కొంచెం చక్కెర పోసిందని, అలా ఎందుకు చేస్తున్నారని తాను అడిగితే తమ సంస్కృతిలో అలా చేస్తే ఆ మనిషి తొందరగా వస్తారనే నమ్మకం ఉందని చెప్పారని, ఇటువంటి సంస్కృతి మహారాష్టల్రో కూడా ఉందని పేర్కొన్నారని, సామాజిక జాతీయవాదం ద్వారా మాత్రమే సాంస్కృతిక జాతీయవాదం సాధ్యం అవుతుందని అన్నారు. మన దేశంలో దేవుడిని పూజించే విధానంలో కూడా ఎన్నో విధానాలున్నాయని చెప్పారు. తాము ఒకసారి మిజోరం వెళ్తే ఒకాయన ఉపన్యాసం ఇస్తూ మిజోరాం సోదరీ సోదరులారా మీరంతా జనజీవన స్రవంతిలో కలవాలి అని పేర్కొన్నారని, అక్కడున్న ఒక ముసలాయన లేచి సార్ మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, అందరం ఒక్కటే ఒకరం మెయిన్ స్ట్రీం కాదు, ఒకరు సైడ్ స్ట్రీం కాదు అని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. మనకు అనుకూలమైన ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కదా అని, మోదీకి అన్నీ చెప్పేశాం, ఆయనే చూసుకుంటారు అంటే కుదరదని, అంతా జాగరూకులై ఉండాలని పేర్కొన్నారు.