తెలంగాణ

స్పీకర్ పరిశీలనలో అనర్హత పిటిషన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన అనర్హత పిటీషన్లు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పరిశీలనలో ఉన్నాయని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు నివేదించనున్నారు. తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరడంతో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాల్సిందిగా తాము స్పీకర్ వద్ద పిటీషన్లు దాఖలు చేసినా, చర్య తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా సుప్రీంకోర్టు నోటీసు నేపథ్యంలో స్పీకర్ ఎస్.మధుసూదనా చారి శనివారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజా సదారాంతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించినందున, హాజరై అంశం పిటీషన్లు స్పీకర్ పరిశీలనలో ఉన్నట్లు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నారు. అనర్హత పిటీషన్లపై ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులో ఎక్కడా పేర్కొనలేదన్న విషయాన్ని ఎజి న్యాయస్థానానికి విన్నవించే అవకాశం ఉంది.