తెలంగాణ

పుష్కర ఏర్పాట్లు భేష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు20: కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు బేష్‌గా ఉన్నాయని, లక్షలాధి మంది భక్తులు పుష్కర స్నానానికి వస్తున్నప్పటికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవడం అధికార యంత్రాంగాన్ని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కొనియాడారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా 9వ రోజు శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ధంపతులు అలంపూర్‌లోని జోగులాంబ (గొందిమల్ల) పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం చేశారు. అనంతరం ఐదవ శక్తిపీఠం జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరిత గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు మహబూబ్‌నగర్ జిల్లాలో బేష్‌గా ఉన్నాయని ఇందుకు గాను తాను అధికార యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు తాను అభినందనలు తెలుపుతున్నానని అంతే కాకుండా కృష్ణా పుష్కరాల్లో పోలీసుల సేవలు అభినందనీయమని వారి సేవలను ప్రజలు మరవకూడదన్నారు. మీడియా సహితం ప్రజల సంక్షేమం కోసం, రైతు అబివృద్ధి కోసం, ప్రాజెక్టుల నిర్మాణం కోసం మంచి దృక్పదంతో పని చేయాలని కోరారు. ఇటీవల రక్షాబందన్ రాష్ట్రంలో కొత్త ఒరవడిని తెచ్చిందని, ఆడపిల్లలంటే గౌరవించే సంప్రాదాయాన్ని తెలంగాణ రాష్ట్రం మరింత తీసుకొచ్చిందన్నారు. ఆడ పిల్లలను గౌరవించి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాల్సిన బాద్యత మనందరిదన్నారు. మంచి రాష్ట్రం, మంచి సమాజం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందులో ప్రజాప్రతినిధుల పాత్రే కాకుండా ప్రజల పాత్ర చాలా కీలకమన్నారు.

చిత్రం.. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని గొందిమళ్ల పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరిస్తున్న గవర్నర్ దంపతులు.