తెలంగాణ

పుణ్య స్నానాలకు పోటెత్తిన పుష్కర ఘాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 20: కృష్ణా పుష్కర ఘాట్‌లు తొమ్మిదవ రోజు పుష్కర పుణ్య స్నానాలకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంతో జనజాతరను తలపించాయి. కృష్ణావేణి జన ప్రవాహంతో సాగుతుందన్నట్లుగా తీరం వెంట మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్, అడవిదేవులపల్లి, ధర్శేశిపురం, ఛాయ సోమేశ్వర, ఆజ్మాపూర్, నేరడుచర్ల మహంకాళీఘాట్, మేళ్లచెర్వు కిష్టాపురం, వజినేపల్లి పుష్కర ఘాట్‌లు భక్తజనం పుష్కర స్నానాలతో పొటెత్తాయి. పుష్కరాల ముగింపు సమయం దగ్గర పడుతున్న కొద్ధి భక్తుల రద్ధీ పెరిగిపోతుండగా అత్యధికంగా నాగార్జున సాగర్ పుష్కర ఘాట్‌కు భక్తుల తాకిడి ఎక్కువైంది. ఎండలు దంచుతున్నా భక్తులు సుదూర ప్రాంతాల నుండి కృష్ణమ్మ ఒడిలో పుష్కర పుణ్య స్నానాలకు వ్యయప్రయాసలతో తరలివస్తున్నారు. మట్టపల్లి, వాడపల్లి, సాగర్ ఘాట్‌లకు సాయంత్రంకల్లా నాలుగు లక్షల మందికి పైగా జనం రాగా జిల్లా వ్యాప్తంగా శనివారం ఆయా ఘాట్‌లలో 5లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆఛరించినట్లు తెలుస్తుంది. వాడపల్లిలో శివాలయం పుష్కర ఘాట్‌కు భక్తుల తాకిడి ఎక్కువవ్వడంతో ఇతర ఘాట్‌లకు భక్తులను మళ్లించారు. దైవ దర్శనాలకు బారులు తీరిన భక్తజనంతో మట్టపల్లి లక్ష్మినరసింహ, వాడపల్లి లక్ష్మీనరసింహ, మీనాక్షీ అగస్తేశ్వర, సాగర్ శివాలయం, అడవిదేవులపల్లి బౌద్ధమగుళ్ల సూర్యదేవాలయం,పంచాయతన శివాలయాలు కిటకిటలా డాయి. అటు కాచరాజుపల్లి, ఉట్లపల్లి, పెద్దమునిగాల్, బుగ్గమాదారం ఘాట్‌లకు సైతం పుష్కర రోజుల చివరికి చేరుతున్న క్రమంలో భక్తుల రాక పెరిగిపోతుంది. మట్టపల్లిలో మధురై హైకోర్డు జడ్జీ నూతి రాంమోహన్‌రావు కుటుంబంతో పుష్కర స్నానం చేసి లక్ష్మీనరసింహుడి దర్శనం చేసుకున్నారు.

చిత్రం.. నల్లగొండ జిల్లా ధర్వేశిపురం ఘాట్‌లో పుష్కర స్నానాలచరిస్తున్న భక్తులు