తెలంగాణ

బంద్‌తో అట్టుడికిన సిరిసిల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 20: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల జిల్లా సాధన కోసం చేపట్టిన పట్టణ బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు పలు విధ్వంసాలు చేపట్టినా పోలీసులు నియంత్రించడంలో విఫలమయ్యారు. బంద్ సందర్భంగా మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. అంబేద్కర్ చౌక్‌లో మంత్రి కె.తారకరామారావు భారీ కటౌట్‌ను ఆందోళనకారులు పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని, పలువురు నాయకులను అరెస్టు చేసి ఇతర మండలాల పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్, పాత బస్టాండ్ నేతన్న విగ్రహం కూడళి, బైపాస్ రోడ్డు, బస్ డిపో ముందు టైర్లను పెద్ద సంఖ్యలో తగుల పెట్టి రోడ్డుపై వేసి, బస్సుల రాకపోకలను నియంత్రించారు. అలాగే వేకువ జామునే దుకాణాలు తీయడానికి ప్రయత్నించిన వ్యాపారుల పలు దుకాణాలను పెద్ద బజార్‌లో ధ్వంసం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే భారీ ఖర్చుతో ఏర్పాటు చేసిన బస్‌స్టాపుల్లోని సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్ల్లెక్సీలను దహనం చేశారు. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి పట్టణ ప్రధాన రోడ్లలోని డివైడర్లపై ఏర్పాటు చేసిన సిఎం, మంత్రుల ఫొటోల హోర్డింగులను ధ్వంసం చేశారు. గాంధీరోడ్డు, అంబేద్కర్ చౌక్ నుండి ఇటు గోపాల్‌నగర్, అటు పాత బస్టాండ్ వైపు కరీంనగర్ రోడ్డులో అమర్చిన హోర్డింగులన్నింటినీ ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వాటికి అమర్చిన ఫ్లెక్సీలను చించివేసి దహనం చేశారు. ఎల్‌ఐసి వద్ద ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్‌పై ఉన్న ప్రభుత్వ భారీ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఇక పాలకుల ఫొటోలతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై పేడ ముద్దలు విసిరి నిరసనలు తెలిపారు. సిరిసిల్ల డిపోకు చెందిన రెండు బస్సులు, జగిత్యాల డిపోకు చెందిన ఒక బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. వేకువజామునే డిపో వద్దకు చేరుకుని టైర్లు కాల్చి, డిపో గేట్లకు తాళాలు వేయడంతో బస్సులు బయటకు వెళ్ళలేదు. బయటి నుండి వచ్చిన ఆర్టీసీ బస్సులను పట్టణం బయటే నిలిపివేశారు. పట్టణంలోకి వచ్చిన వాటిని అడ్డుకుని వెనక్కు పంపారు. ఇక ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బస్సులను పొలిమేరల్లోనే నిలిపివేశారు. అంబేద్కర్ చౌక్, పాత బస్టాండ్‌ల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నాలు, రాస్తారోకోలతో అట్టుడికిపోయింది. ఇతర ప్రాంతాల నుండి భారీగా పోలీసు అధికారులను తరలించినా తీవ్ర ఆందోళన మధ్య పోలీసులు వారించినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. పోలీసులతో పలుసార్లు న్యాయవాదులు, ఆందోళనకారులతో వాగ్వాదాలు జరిగాయి. ఉద్రిక్తతల మధ్య ఆందోళన కొనసాగినా బంద్ ప్రశాంతంగా, స్వచ్ఛందంగా సాగడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడి ఆందోళనకర పరిస్థితులను తెరాస నాయకులు హైదరాబాద్‌లోని పాలకులకు, మంత్రి కెటిఆర్ పిఎస్‌కు సమాచారం అందించారు. ఆందోళనకారులు ధ్వంసం చేసిన కెటిఆర్ కటౌట్‌ను, ఫ్లెక్సీలను ఫొటోలు తీసి పంపించారు. మరో మంత్రి కటౌట్‌ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు కొనసాగించారు. అయితే వీటిని ఇక ఎక్కువ కాలం రక్షించలేమన్న కారణంతో భారీ కౌటవుట్‌లను సైతం హుటాహుటిన తొలగించారు. మరో వైపు అధికార పార్టీ నాయకులు తమ పట్టణం కనిపించలేదు.