తెలంగాణ

టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7:శాసన మండలికి ఎన్నికైన పది మంది టిఆర్‌ఎస్ సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ జూబ్లీ హాలులోని దర్బారు హాలులో మండలి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు,తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్‌రెడ్డి, ఎంపి కవిత, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్సీలు పురాణం సతీష్(ఆదిలాబాద్) భూపతిరెడ్డి( నిజామాబాద్), భూపాల్‌రెడ్డి( మెదక్), కొండా మురళీధర్‌రావు(వరంగల్), బి లక్ష్మీనారాయణ( ఖమ్మం) , టి.్భనుప్రసాద్, నారదాసు లక్ష్మణరావు(కరీంనగర్) పట్నం సురేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు( రంగారెడ్డి) కసిరెడ్డి నారాయణరెడ్డి( మహబూబ్‌నగర్)లు శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండవ సారి మండలి సభ్యునిగా రావడం సంతోషంగా ఉందని బి లక్ష్మీనారాయణ తెలిపారు. తమపై విశ్వాసం ఉంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు అని మండలి సభ్యులు తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతూ బంగారు తెలంగాణ సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తొలుతఅమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు.