తెలంగాణ

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 7: తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు వెచ్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా ములుగు శివారులో ఉద్యానవన యూనివర్సిటీ, అటవీ కళాశాలల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తితో తెలంగాణ ప్రాంతం విత్తన భాండాగారంగా మారనుండగా 15 శాతం అభివృద్ధి సాధించనుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ములుగు ప్రాంతాన్ని ఉద్యానవన యూనివర్సిటీకి సిఎం కెసిఆర్ ఎంపిక చేయడం ప్రశంసనీయం కాగా అభ్యున్నతికి సంకేతంగా నిలుస్తూ దేశ, విదేశాలకు ఈ ప్రాంతం నుండి పండ్లు, కూరగాయల ఎగుమతి జరగడానికి అవకాశం ఏర్పడిందని ఆయన అన్నారు. అయితే ప్రైవేటు, పబ్లిక్, పరిశోధకుల భాగస్వామ్యం అవసరం కానుండగా నూతన పరిశోధనలతోనే మంచి ఫలితాలు రాబట్టవచ్చని అన్నారు. మెదక్ జిల్లాతో పాటు జంట నగరాలకు సమీపంలో 400 పైగా సీడ్ కంపెనీలు ఉండగా రూ.4 వేల కోట్ల విలువ చేసే విత్తనాల విక్రయం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి అనువుగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని కేంద్రం ప్రోత్సహించడం ద్వారా ధాన్యం, కూరగాయలు, పూల ఎగుమతి జరిగి భవిష్యత్తులో బంగారు పంటలకు కేంద్రం కాబోతోందని జోస్యం చెప్పారు. అయితే వ్యవసాయ పరిశోధనలకు కేంద్రం పెద్దపీట వేస్తూ ప్రోత్సహించాలని అన్నారు. సిఎం కేసిఆర్‌తో పాటు కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్, ఐసిఆర్ చైర్మన్ అయ్యప్పన్, రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాంలునాయక్, సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబూమోహన్, చింత ప్రభాకర్, మదన్‌రెడ్డి, జెడ్‌పి చైర్మన్ రాజమణి, డిసిసిబి చైర్మన్ చిట్టిదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గఢా అధికారి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సాయం భేష్
ములుగు/జగదేవ్‌పూర్: కరవుతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతల ఇబ్బందులు, సమస్యలపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ స్పందించిన తీరు ప్రశంసనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యానవన యూనివర్సిటీ, అటవీ కళాశాలలకు సిఎం కెసిఆర్‌తో పాటు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అతివృష్టి, అనావృష్టిల ఫలితంగా పంటలు నష్టపోతే గతంలో రాష్ట్ర ఇబ్బందులు కేంద్రం దృష్టికి తీసుకెళ్తే కరవు బృందాలు ఇష్టం వచ్చిన సమయంలో పంపించే వారని, రాధామోహన్ సింగ్‌కు వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన ఉండడంతో కేవలం 2, 3 రోజుల్లోనే బృందాలను పంపిచి నివేకదిక తెప్పించుకున్నట్లు స్పష్టం చేశారు.

పేదరికమే వెనుదిరిగింది..
అంతిమ లక్ష్యమే నెగ్గింది

సివిల్ జడ్జిగా ఎన్నికైన భద్రాచలం న్యాయవాది

భద్రాచలం, జనవరి 7: నిరుపేద కుటుంబం..రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. అంగవైకల్యంతో బాధపడే తమ్ముడు.. ఇంటిల్లిపాదీ కష్టపడితే కానీ సాగని బతుకుబండి. జంతికలు, చకోడీలు అమ్ముకుంటూనే మిగిలిన సమయంలో చదువుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉపకార వేతనాలతో న్యాయశాస్త్రం పూర్తి చేశాడు. భద్రాచలం పట్టణానికి చెందిన నిరుపేద దేవరపల్లి నాగేశ్వరరావు తెలుగు రాష్ట్రాలు విడుదల చేసిన జూనియర్ సివిల్ జడ్జిల ఉద్యోగాల ఫలితాల్లో విజయం సాధించాడు. లక్ష్యానికి ఎటువంటి ఆటంకాలు ఎదురు నిలవలేవని నిరూపించాడు. రెండు రాష్ట్రాల్లో 80 ఉద్యోగాలకు 15వేల మంది పోటీ పడగా ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా జనరల్ విభాగంలో ఉద్యోగం సాధించి తన సత్తా చాటాడు. దేవరపల్లి నాగేశ్వరరావు జీవితం వడ్డించిన విస్తరి కాదు. తండ్రి దేవరపల్లి సత్యనారాయణ, తల్లి కళావతి. జీవన పోరాటంలో నిత్యం ఏదో ఒక పని చేసుకుని కాలం వెళ్లదీసేవారు. స్థానిక కొర్రాజులగుట్ట హైస్కూల్‌లో 10వ తరగతి పాసైన నాగేశ్వరరావు జంతికలు, చకోడీలు అమ్ముకుంటూ ఇంటర్ డిగ్రీ చదివారు. తర్వాత కూడా మెరిట్‌పై ఖమ్మంలో మానేరు లా కళాశాలలో ఉపకార వేతనంతో చదువుకున్నారు. 2003 నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ 2012లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ప్రభుత్వ పథకాలలోలీగల్ కో-ఆర్డినేటర్‌గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం చేసుకుంటూ జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగానికి నిర్వహించిన పరీక్షలు రాసి బుధవారం వెలువడిన ఫలితాల్లో సఫలీకృతులయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో 2015 ఫలితాలు కూడా రానున్నాయి.
ఏపీపీ దేవదానం స్ఫూర్తితో...
సీనియర్ ఏపీపీ దేవదానం స్ఫూర్తితో పాటు తల్లిదండ్రుల ఆశీస్సులు, సతీమణి సరోజిని ప్రోత్సాహంతో ఈ విజయం సాధ్యమైందని జడ్జిగా ఎంపికైన దేవరపల్లి నాగేశ్వరరావు అంటున్నారు. చిన్నతనంలో ఏపీపీ దేవదానం ఇంట్లో పెరిగానని, నల్లకోటు చూసి చదువు సాగించానని, అందుకే మాస్టర్ ఆఫ్ లాలో కూడా ఆయనలాగే ఎల్‌ఎల్‌ఎం(రాజ్యాంగం) చదివానని చెబుతున్నారు. పేదవాడి వద్దకే న్యాయం అనే లక్ష్యంతో ముందుకు సాగుతానని అంటున్నారు. తనకు అన్ని వేళలా భద్రాచలం బార్ అసోషియేషన్ అండదండగా నిలిచిందని వారికి కృతజ్ఞతలు తెలిపారు.