తెలంగాణ

రూ.5.5 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 7: తెలంగాణ రాష్ట్రంలో 70,880 కిలోమీటర్ల పొడవున ఉన్న పంచాయతీరాజ్ రోడ్లను 5,474 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయితీరాజ్ ఎం సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం ఖమ్మం వచ్చిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బిటి, మెటల్, మట్టి రోడ్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారీ మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. తెలంగాణాలో రోడ్ల అభివృద్ధికి ఏప్పుడూ 350 కోట్ల రూపాయలకు మించి నిధులు కేటాయించలేదని, మొదటి సారిగా ముఖ్యమంత్రి కెసిఆర్ పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం ఈ ఒక్క సంవత్సరానికే 1200 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. రాష్ట్రంలో 70,880 కిలోమీటర్ల పంచాయితీరాజ్ రోడ్లను అభివృద్ధి చేయాలని 2014 నవంబర్‌లో తమ శాఖతో ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించిందని, 2014-15, 2015-16 సంవత్సరాలలో ఈ పనులు పూర్తి చేసే విధంగా ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని పనులను పరిశీలిస్తున్నామని, ఇప్పటి వరకు 6 జిల్లాలో రోడ్ల అభివృద్ధి పనులను పరిశీలించినట్లు తెలిపారు. అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మెటిరియల్ లేక పనులు ఆలస్యమవుతున్నాయని, దీనిపై ఆయా కలెక్టర్లతో చర్చిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మించనున్న బ్రిడ్జిలను కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నిర్మించిన విధంగా చెక్‌డ్యాంలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వరంగల్ జిల్లాలో పనులు అలస్యంగా చేస్తున్న నలుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తాం
సంస్థ జెఎండి రమణారావు వెల్లడి
సూర్యాపేట,జనవరి 7: నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ ఆర్టీసీని లాభాలబాట పట్టించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ జెఎండి బివి.రమణరావు తెలిపారు. నల్గొండ జిల్లా సూర్యాపేట ఆర్టీసీ డిపోను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ విభజన అనంతరం తెలంగాణ ఆర్టీసీ రూ.460 కోట్ల నష్టాల్లో నడుస్తోందని పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా 95 ఆర్టీసీ డిపోలు ఉండగా అందులో ఐదు డిపోలు మినహా మిగిలిన డిపోలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నట్లు వివరించారు. నష్టాలను నివారించేందుకు తీసుకున్న చర్యల వల్ల 26 డిపోల్లో నష్టాలు తగ్గించినట్లు చెప్పారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా రాష్టవ్య్రాప్తంగా వ్యాపార ప్రాధాన్యత కలిగిన బస్టాండ్‌లను గుర్తించి వాటిలో ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ప్రయాణికులను ఆకర్షించేలా బస్టాండ్‌లను ఆధునీకరిస్తున్నామన్నారు. కాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనంగా బస్సు సర్వీస్‌లను నడిపించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో 2,715 బస్సులను అదనంగా నడపడంతో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మరో 500 బస్సు సర్వీస్‌లను నడపనున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటే మరిన్ని బస్సులను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీలో అద్దె బస్సులు నడపడంపై అపోహలు సృష్టిస్తున్నారని, సంస్థ నష్టాలను అధిగమించే చర్యల్లో భాగంగా 25 శాతం అద్దెబస్సులను నడిపించాలని యాజమాన్య బోర్డు నిర్ణయించామన్నారు. రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి పల్లెవెలుగు బస్సును నడిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నల్గొండ రీజియన్‌లో సూర్యాపేట డిపో అధిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నందున వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో ఆర్‌ఎం కృష్ణహరి, ఆర్‌ఎంవో ముణిశేఖర్, డిఎం భక్షినాయక్ పాల్గొన్నారు.