తెలంగాణ

ఆదేశాలు పాటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: హైకోర్టు తీర్పును గౌరవించి కోర్టు చేసిన సూచనమేరకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని సిఎం కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గురువారం చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించారు. ఈమేరకు సిఎం పేరిట ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన 21 రోజుల్లో పోలింగ్ జరపాలని హైకోర్టు చెప్పిన తీర్పును గౌరవిస్తూ కోర్టు చెప్పిన ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు ఎదురయ్యే ముఖ్యమైన రెండు మూడు రకాల ఇబ్బందులు తొలగించడానికే తక్కువ సమయంలో జిహెచ్‌ఎంసి ఎన్నికలు నిర్వహించాలని భావించినట్టు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు లక్షమంది ఉద్యోగులు అవసరమవుతారని, తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఉన్న 3 లక్షల మంది ఉద్యోగుల్లో మూడోవంతు ఉద్యోగులు నెల రోజులపాటు ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, దీనివల్ల పరిపాలనలో అసౌకర్యం కలుగుతుందని, అభివృద్ధి పనులు కుంటుపడతాయని భావించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో అతి ఎక్కువ జనసాంద్రత ఉన్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం తీసుకోవడంవల్ల ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. పైకారణాలను దృష్టిలో పెట్టుకుని జిహెచ్‌ఎంసి ఎన్నికలను తక్కువ సమయంలో పూర్తి చేయాలని భావించామని పేర్కొన్నారు. తమ ఆలోచన కూడా ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం భావించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సర్కారు ఉరుకులు పరుగులు
జిహెచ్‌ఎంసి ఎన్నికలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించింది. కోర్టు తీర్పు వెలువడగానే గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ వద్దకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వెళ్లి కోర్టు తీర్పు సారాంశాన్ని వివరించారు. మరోవైపు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, మంత్రివర్గ సీనియర్ సభ్యులతో క్యాంపు కార్యాలయంలో సిఎం సమావేశమైయ్యారు. హైకోర్టు తీర్పును అనుసరించి గడువులోగా జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణపై సిఎం చర్చించినట్టు తెలిసింది.