తెలంగాణ

గొంతులో విక్స్ డబ్బా ఇరుక్కుని చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసారూరల్, జనవరి 6: గొంతులో విక్స్ డబ్బా ఇరుక్కోవడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని మహగాం గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన వనజ, గణేష్‌ల మొదటి సంతానమైన సాయికృతిక్ష ఇంట్లోని విక్స్‌డబ్బా మింగడంతో విషయం గమనించిన తల్లి తీయడానికి ఎంత ప్రయత్నించి బయటకు రాకపోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. తమ చిన్నారి కళ్లముందే అకాల మరణం చందడంతో కుటుంబీకుల రోదనలు నిన్నంటాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు చిన్నారిని కడసారి చూడడానికి తరలివచ్చి కంటతడి పెట్టారు.

మృతి చెందిన చిన్నారి సాయికృతిక్ష (ఫైల్‌ఫొటో)