తెలంగాణ

కొలిక్కివచ్చిన కిడ్నీ రాకెట్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 6: రాష్ట్రంలో సంచలనం రేపిన కిడ్నీ విక్రయాల దందా వ్యవహారంలో నల్లగొండ జిల్లా పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ప్రకటించారు. బుధవారం రాత్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కిడ్నీ రాకెట్ కేసు వివరాలను వెల్లడించి నలుగురు నిందితులు కసపరాజు సురేష్, ఎండి.అబ్ధుల్ హఫీజ్, పాలెం మహేష్, కొత్తపల్లి నరేష్‌లను హాజరుపరిచారు. వీరిలో నల్లగొండ పట్టణానికి చెందిన కసపరాజు సురేష్ హైదరాబాద్ రాంనగర్‌లో హోటల్ మేనేజిమెంట్ కోర్సు చదువుతున్నాడు. డబ్బు ఆశతో ఉండే సురేష్ ఇంటర్‌నెట్‌లో డబ్ల్యుడబ్ల్యుడబ్లు ఐనీడ్‌కిడ్నీ.కామ్ వెబ్‌సైట్‌లో కిడ్నీ కావాలన్న ప్రకటన చూసి 2014 నవంబర్‌లో ఆన్‌లైన్‌లోనే ఏజెంట్‌ను సంప్రదించి కొలంబోకు వెళ్లి తన కిడ్నీని ఐదు లక్షలకు విక్రయించాడు. ఇదేదో లాభసాటి వ్యాపారంగా ఉందని భావించి వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటుపడిన సురేష్ కొలంబో, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌కు చెందిన కిడ్నీ వ్యాపారం ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకుని తనతో పాటు 15 మంది కిడ్నీలను అమ్మించాడు. వారికి కొలంబో హాస్పిటల్‌కు వెళ్లి కిడ్నీ ఇచ్చేందుకు పాస్‌పోర్టులు, వీసాలతో పాటు కిడ్నీ మార్పుకు సంబంధించి ఆపరేషన్‌తో సహా 27 లక్షల చొప్పున ఖర్చు చేశారు. ఒక్కో కిడ్నీ సర్జరీకి 13 లక్షలు, దాతల మందులకు 1.5 లక్షలు, ప్రయాణ ఖర్చులకు 2 లక్షలు పోగా కిడ్నీ దాతకు 5 లక్షలు చెల్లించి బ్రోకర్ సురేష్‌కు కమిషన్‌గా 50 వేలు చెల్లించారు. ఇలా వచ్చిన డబ్బుతో సురేష్ కారు, మోటార్ సైకిల్‌తో పాటు ఖరీదైన సెల్‌ఫోన్స్ కొనుగోలు చేస్తు జల్సా జీవనం సాగిస్తున్నాడు. సురేష్‌తో పాటు నల్లగొండకు చెందిన మరో ముగ్గురు, హైదరాబాద్‌కు చెందిన నలుగురు, బెంగుళూర్‌కు చెందిన నలుగురు, తమిళనాడుకు చెందిన ఇద్దరు, ముంబై, ఢిల్లీలకు చెందిన ఒక్కొక్కరు తమ కిడ్నీలను విక్రయించడంలో కసపరాజు సురేష్ ఏజెంట్లకు కిడ్నీ దాతలకు మధ్య బ్రోకర్‌గా వ్యవహరించాడు. ఈ వ్యవహారంలో కొంత మంది బాధితుల నుండి అందిన ఫిర్యాదు మేరకు సురేష్‌ను అరెస్టు చేసి విచారించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఎస్పీ దుగ్గల్ తెలిపారు. కిడ్నీల విక్రయానికి పాల్పడిన నిందితులు కసుపరాజు సురేష్‌తో పాటు నల్లగొండ రహమాబాగ్‌కు చెందిన ఎండి.హబ్ధుల్ హాఫీజ్, నిడమనూర్ మండలం రాజన్నగూడెంకు చెందిన పాలెం మహేష్, చిట్యాల మండలం సంతోష్ నగర్‌కు చెందిన కొత్తపల్లి నరేష్‌లను అరెస్టు చేశామన్నారు. సురేష్ వెనుక ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన కిడ్నీ విక్రయ ముఠా ఏజెంట్లను గుర్తించి త్వరలో అరెస్టు చేసేందుకు పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేస్తుందన్నారు. సురేష్ వద్ధ నుండి మూడు పాస్‌పోర్టులు, ఒక బైక్, టాటా ఇండికా కారు, డెబిట్ కార్డులు, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై ఏపి టాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హుమన్ ఆర్గనైజ్ యాక్ట్ 1995, ఐపిసి సెక్షన్ 370 (1, 2, 3), అక్రమ వ్యాపారం సెక్షన్స్ 420, 120(బి) సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో ఎఎస్పీ గంగారాం, ఒఎస్‌డి వెంకటేశ్వర్లు, డిఎస్పీ సుధాకర్, సిఐలు రవిందర్, శ్రీనివాస్ ఉన్నారు.

చిత్రం... కిడ్నీ విక్రయాలకు పాల్పడిన నిందితుల
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్