తెలంగాణ
సెలవులు ఇవ్వని స్కూళ్లపై కొరడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 16: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్) ప్రబలుతున్న నేపథ్యంలు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘించి స్కూళ్లు నడుపుతున్న యాజమాన్యాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రాజధాని నగరంలోని వీఐపీ ఇంటర్నేషనల్ స్కూల్ , స్ప్రింగ్ ఫీల్డు స్కూల్, షిరీన్ పబ్లిక్ స్కూల్ , జాషువా స్కూల్, సన్‌రైజ్ స్కూల్, రోసరీ కానె్వంట్ స్కూల్, ఆల్ సెయింట్స్ హైస్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ (ఆబిడ్స్), సెయింట్ మార్క్సు బోయిస్ టౌన్ స్కూల్ (బహుదూర్‌పుర) పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. పాఠశాలల గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఈ నోటీసులు ఇచ్చారు. ఒక పక్క టెన్త్ పరీక్షలు 19 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి పాఠశాలలో టీచర్ల అవసరం ఉంటుందని, వర్కు చార్టుల రూపకల్పన, ఇన్విజిలేషన్ వర్కు, ఎగ్జామినేషన్ హాల్స్‌ను సిద్ధం చేయడం, హాల్‌టిక్కెట్లను జారీ చేయడం, పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి కార్యకలాపాలుంటాయని స్కూళ్లను మూతవేస్తే ఆ పనులు అన్నీ ఎవరు చేయాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. కొన్ని స్కూళ్లను మూసివేయలేదని, పాఠశాలకు రమ్మని విద్యార్థులకు చెబుతున్నాయని కొంత మంది చేసిన ఫిర్యాదులపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే ఆయా పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. కేటీఆర్ ఆదేశాలతో విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ దృష్టికి తీసుకువెళ్లారు. వెనువెంటనే ఆమె ఒక మెమో జారీ చేశారు. ఈ సమాచారాన్ని తిరిగి సబితా ఇంద్రారెడ్డి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో సమాచారం ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ప్రైవేటు యూనివర్సిటీలు ఇంత వరకూ మూసివేయలేదని, ప్రభుత్వ యూనివర్సిటీలు సైతం హాస్టళ్లను మూసివేస్తున్నట్టు చెబుతున్నా ఇంత వరకూ మూసివేయలేదు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లను మూసివేస్తున్నట్టుప్రకటించింది. కానీ విద్యార్థులు ఇంకా హాస్టళ్లను ఖాళీ చేయలేదు, అలాగే ఇఫ్లూ సైతం 18వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. ఇక హైదరాబాద్‌లోని ప్రైవేటు యూనివర్సిటీలు మూత వేయలేదు, హాస్టళ్లను మూసివేయలేదు. కొన్ని కార్పొరేట్ కాలేజీలు లాంగ్‌టెర్మ్ కోచింగ్ క్లాసులను కళ్ల ముందే నిర్వహిస్తున్నా చర్యలు తీసుకునే నాధుడే లేడు. అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారని విద్యార్థులు వాపోతున్నారు.