తెలంగాణ

నీటి వినియోగం, ఆవాల పరిశోధనా కేంద్రాలు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణలో సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం, ఆవాల పరిశోధనా కేంద్రాలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సోమవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు లేఖ రాశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో పెద్ద ఎత్తున సాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. 25 మేజర్, 12 మీడియం ప్రాజెక్టులు ఉన్నాయని, మిషన్ కాకతీయ పథకంతో 46 వేల చెరువులు, కుంటల పునరుద్దరణ జరిగిందన్నారు. భూగర్భజలాలు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాలకు సాగునీరు లభిస్తోందని, దాంతో సాగునీటిని సమర్థతగా వాడుకునేందుకు, తాగునీరు, సాగునీరు కలిసిపోయి కలుషితం కాకుండా చూసేందుకు సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణలో ఆవాల పంట ఎక్కువ విస్తీర్ణంలో ఉందని, ఆవాల ఉత్పత్తి, ఉత్పాదక పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు అనుకూలమైన జగిత్యాలలో ఆవాల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కోరారు. గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా కేంద్ర మంత్రికి సూచనలను చేశానని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు.