తెలంగాణ

బెల్ట్ షాపులు ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: ఇంటింటికీ మంచినీరు దొరకలేదు కాని, ఇంటింటికీ మద్యం మాత్రం బెల్ట్‌షాపుల ద్వారా తెరాస ప్రభుత్వం అందిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం మద్యం బెల్ట్‌షాపులను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. ఆదివారం శాసన సభ సమావేశాల్లో బడ్జెట్ పద్దులపై రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం కోసం బెల్ట్‌షాపులు నడుపుకోవడానికి అనుమతి ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. పల్లెల్లో తక్షణం బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గ్రామీణా ప్రాంతాల్లో విద్య, వైద్యం కుంటుబడుతోందని, దీనికి ప్రభుత్వం కళ్లు తెరవకపోతే తెలంగాణ సామాజానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మద్యం విక్రయాలను నియంత్రించకపోతే పేదవాడి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బెల్ట్‌షాపులు ఎత్తివేయకపోతే వైద్యరంగానికి ఖర్చు చేస్తున్న నిధులు బూడిదలోపోసిన పన్నీరు అవుతుందన్నారు. వైద్య రంగానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వైద్య సిబ్బందిని నియమించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం దవాఖానాల్లో సిబ్బంది లేకపోవడంతోప్రజలు ప్రైవేట్ దవాఖానాల్లోకి పరుగులు తీస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జరగని పనులను జరిగినట్లు సర్పంచ్‌లతో తీర్మాణాలు చేయించడం ఏమిటని ఆయన నిలదీశారు. గ్రామీణ ప్రాంతల్లో విద్యార్థల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలలను మూసేయాలన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత స్పష్టంగా కన్పిస్తోందని, మరికొన్ని చొట్ల విద్యార్థలు లేక పాఠశాలలు వెలవెలపోతున్నాయని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకునే మిషన్ భగీరత పథకం లక్ష్యం నెరవేరడంలేదన్నారు. కేసీఆర్ పాలనలో పారదర్శకత కన్పించడంలేదని, వీటికి పట్టణ, గ్రామ పంచాయతీలే నిదర్శనం అన్నారు. సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు సాగునీటి ప్రాజెక్టుల పనులు కట్టబెట్టంతో వేల కోట్లు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దీంతో తెరాస ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. రాజగోపాల్‌రెడ్డి ప్రసంగాన్ని స్పీకర్ మైక్‌ను కట్ చేశారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి తెరాస ఎమ్మెల్యేలు మధ్య వాగ్వాదం నెలకొంది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సభలో ఎక్కువ మంది సభ్యులు మాట్లాడాలని, ప్రతి సభ్యుడికి 5 నిమిషాలు మాత్రమే అవకాశం ఉందన్నారు. ప్రజలకు సంబంధించిన 25 డిమాండ్లు ఉన్నాయని, తాను మాట్లాడడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి పట్టుబట్టారు. అయితే స్పీకర్ ససేమిరా అంటూ మరో సభ్యుడు దాసరి మనోహరరెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు