తెలంగాణ
రాష్ట్ర జన శిక్షణా సంస్థ చైర్మన్‌గా ప్రకాష్ గౌడ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 15: కేంద్ర ప్రభుత్వ జన శిక్షణా సంస్థ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా ఆర్.ప్రకాష్‌గౌడ్ నియమితులయ్యారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శాఖ గౌడ్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఐఎన్‌టీయూసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గత 47 సంవత్సరాలుగా ప్రజలు, కార్మిక సమస్యలపై పోరాడుతున్న గౌడ్ ప్రస్తుతం ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర జన శిక్షణా సంస్థ చైర్మన్‌గా నియమించిందని గౌడ్ తెలిపారు. యువతకు స్వయం ఉపాధి కలిగించేందుకు శిక్షణ ఇచ్చే పథకమే జన శిక్షణా సంస్థ అని గౌడ్ చెప్పారు. వివిధ జిల్లాల్లోని గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన నిరక్షరాస్యులు లేదా కనీసం ఎనిమిదో తరగతి చదివిన నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఈ సంస్థ శిక్షణ ఇస్తుందని గౌడ్ పేర్కొన్నారు. తనను జన శిక్షణా సంస్థ చైర్మన్‌గా నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షులు జీ. సంజీవ రెడ్డికి గౌడ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.